RG Kar college ex-principal: ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు
ABN, Publish Date - Aug 24 , 2024 | 05:47 PM
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది.
కోల్‌కతా, ఆగస్ట్ 24: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌పై సీబీఐ శనివారం కేసు నమోదు చేసింది. ప్రొ. ఘోష్‌పై కేసు నమోదు చేయాలని కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. ప్రొ. సందీప్ ఘోష్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిపై సీబీఐ విచారణ జరపనుంది.
దాంతో సిట్ అధికారులు శనివారం ఉదయం కోల్‌కతాలో నిజాం ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయానికి వెళ్లి.. ప్రొ. ఘోష్‌కు సంబంధించిన అన్ని పత్రాలు అందజేసినట్లు సీబీఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అలీపూర్‌లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌కు అందజేసినట్లు సీబీఐ వివరించింది.
Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్ హయాంలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీలో భారీగా ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన పత్రాలను సీబీఐకి సిట్ అధికారులు అందజేశారు.
Also Read: Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు
ప్రొ. సందీప్ ఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆ కాలేజీ మాజీ డిప్యూటీ సుపరింటెండెంట్ ఆక్తర్ అలీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈడీతో విచారణ జరపాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసు విచారణ జరిపి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని సీబీఐకు కోల్‌కతా హైకోర్టు స్పష్టం చేసింది.
Jammu Kashmir Assembly Elections: నేషనల్ కాన్ఫరెన్స్‌లో నేతలు తిరుగుబాటు
మరోవైపు ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో శనివారం ప్రొ. సందీప్ ఘోష్‌తోపాటు మరో ఆరుగురుకి సీబీఐ పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించింది. ఆగస్ట్ 9వ తేదీన ఈ కాలేజీలో 32 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అతడితోపాటు ఆ రోజు ఆసుపత్రిలో విధి నిర్వహాణలో ఉన్న వైద్యులకు సీబీఐ నేడు పాలీగ్రాఫీ పరీక్షలు నిర్వహించిన విషయం విధితమే. ఈ హత్యాచార ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయన్ని మరో కీలక పదవిలో నియమించింది. ఈ నియామకంపై హైకోర్టు స్పందించింది. ఆయన్ని దీర్ఘ కాలిక సెలవుపై పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Aug 24 , 2024 | 05:48 PM