ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Doctor Murder Case: వైద్యురాలి తల్లిదండ్రులకు అర గంటలో మూడు ఫోన్ కాల్స్..

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:45 AM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి 21 రోజులయింది. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

కోల్‌కతా, ఆగస్ట్ 30: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి 21 రోజులయింది. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రైయినీ వైద్యురాలి మృతికి సంబంధించి పలు భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ కుమార్తె మృతిపై ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల మృతిరాలి తల్లిదండ్రులు పలు సందేహాలు వ్యక్తం చేశారు.

Maharashtra: శివాజీ విగ్రహం కూలిన ఘటనలో పాటిల్ అరెస్ట్


ఆగస్ట్ 9వ తేదీ ఉదయం కేవలం అరగంట వ్యవధిలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి తమకు మూడు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. మొదటి ఫోన్ కాల్‌లో తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. వెంటనే ఆసుపత్రికి రావాలని చెప్పారన్నారు. తమ కుమార్తెకు ఏమైందంటూ ఆందోళనగా ఫోన్‌లో కోరగా.. తాను వైద్యురాలిని కాదని.. అసిస్టెంట్ సూపరింటెండెంటంటూ అవతలి వ్యక్తి స్పష్టం చేశారన్నారు.

ఆ వెంటనే మరో ఫోన్ కాల్ వచ్చిందని.. తమ కుమార్తె అరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించే లోపే.. ముందు ఆసుపత్రిలోని ఛాతీ విభాగానికి రావాలని ఫోన్ చేసిన వారు సూచించారన్నారు. ఆ కొద్ది సేపటికే మరో ఫోన్ కాల్ వచ్చిందని.. తమ కుమార్తె మరణించిందన్నారు. అదీ కూడా ఆమె ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని చెప్పారంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన జరిగే ముందు రోజు అంటే ఆగస్ట్ 8వ తేదీ రాత్రి 11.30 గంటలకు తమ కుమార్తెతో తాను మాట్లాడానని ఈ సందర్భంగా ఆమె తల్లి గుర్తు చేసుకున్నారు. ఆ మరునాడే తన కుమార్తె మరణ వార్త వినాల్సి వచ్చిందన్నారు.

Also Read: Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం


వైద్యురాలిపై హత్యాచారం అనంతరం తమ పట్ల ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తె మృతి చెందిన వెంటనే తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. అలాగే తమ కుమార్తె మృతదేహాన్ని వెంటనే తాము చూసే అవకాశం కూడా కల్పించలేదన్నారు. అందుకోసం దాదాపు 3 గంటలపాటు ఆసుపత్రిలో తమను వేచి ఉంచారని పేర్కొన్నారు.

Also Read: Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్


ఈ అంశంపై ఇప్పటికే కోర్టులో విచారణ జరిగింది. అందుకు కారణాలు ఏమిటని ఆసుపత్రి ఉన్నతాధికారులను ప్రశ్నించింది. ఇప్పటికే స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసుపై స్పందించాయి. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాయి. అలాగే ఈ వ్యవహారంపై మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఛలో సెక్రటేరియట్‌కు పశ్చిమ బెంగా ఛత్ర సమాజ్ సభ్యులు మంగళవారం పిలుపునిచ్చారు.

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


ఆ క్రమంలో వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా బుధవారం బీజేపీ బంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ సైతం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఇక వైద్యురాలి హత్యాచారం కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 11:48 AM

Advertising
Advertising