Kolkata Doctor: తప్పు చేశానని ఏ మాత్రం బాధ లేదు..
ABN, Publish Date - Aug 12 , 2024 | 06:12 PM
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు విస్తుపోయే అంశాలను వివరించారు. సంజయ్‌ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే.. ఏ మాత్రం బాధ పడలేదని, పశ్చాతాపం అనేది అతనిలో ఏ కోశానా కనిపించలేదని పేర్కొన్నారు.
కోల్ కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగికదాడి, హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు సంజయ్ రాయ్ (Sanjay Roy) గురించి పోలీసులు విస్తుపోయే అంశాలను వివరించారు. సంజయ్‌ని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారిస్తే.. ఏ మాత్రం బాధ పడలేదని, పశ్చాతాపం అనేది అతనిలో ఏ కోశానా కనిపించలేదని పేర్కొన్నారు.
హత్య చేశాననే బాధ లేదు..
‘సంజయ్ రాయ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించాం. వైద్యురాలి గురించి అడిగితే జరిగిన నేరాన్ని అంగీకరించాడు. లైంగికదాడి చేసి, హత్య చేశాననే బాధ అతని మొహంలో ఏ మాత్రం కనిపించలేదు. ఓ ప్రాణం తీశాననే బాధ లేదు. ఘటన గురించి ప్రశ్నిస్తే కావాలంటే నన్ను ఉరితీయండి అని సమాధానం ఇచ్చాడు. అతని మొబైల్ స్వాధీనం చేసుకున్నాం. ఓపెన్ చేసి చూస్తే అంతా అశ్లీల కంటెంట్ ఉంది. పోర్న్ చూసి.. వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టి ఉంటాడు అని’ కోల్ కతా పోలీసులు వివరించారు.
సివిక్ వాలంటీర్ అంటే..?
ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద సంజయ్ రాయ్ సివిక్ వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. కాలేజీ, ఆస్పత్రికి వెళ్లేందుకు పర్మిషన్ లేదు. కావాలనే వెళ్లేవాడు. సివిక్ వాలంటీర్లను పోలీసులు నియమించుకుంటారు. ట్రాఫిక్, విపత్తుల సమయంలో తమకు సహాయంగా ఉండేందుకు తీసుకుంటారు. సివిక్ వాలంటీర్ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్‌లో జరుగుతుంది. వీరికి నెలకు రూ.12 వేల నామమాత్ర వేతనం అందజేస్తారు. సివిక్ వాలంటీర్లు పోలీసులు కాదు.
పోలీసుగా ఫోజు..
సివిక్ వాలంటీర్ ఉద్యోగాన్ని రాయ్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తాను పోలీసునని చెప్పుకున్నాడు. అతని టీ షర్ట్ వెనకాల కేపీ అని ఉంటుంది. అంటే కోల్ కతా పోలీస్ అని.. అదేవిధంగా బైక్ మీద కూడా కేపీ అని రాసుకున్నాడు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో అందరికీ తాను పోలీసు అని చెప్పారు. దాంతో నిజమేనని మిగతా వారు నమ్మారు.
అడ్మిషన్ కోసం డబ్బులు
సంజయ్ రాయ్ 2019లో కోల్ కతా విపత్తుల శాఖలో వాలంటీర్‌గా చేరాడు. తర్వాత పోలీస్ సంక్షేమ శాఖకు మారాడు. అక్కడి నుంచి ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడ అందరికీ తాను పోలీసు అని పరిచయం చేసుకున్నాడు. ఆస్పత్రిలో అడ్మిషన్ కోసం వచ్చిన వారిని వదల్లేదు. వారి నుంచి డబ్బులు వసూల్ చేశాడు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో బెడ్లు నిండిపోతే.. దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పక్కన గల ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ ఇప్పిస్తానని కొందరి నుంచి డబ్బులు తీసుకునేవాడట. ఇలా అందనికాడికి దోచుకున్నాడు. ఓ వైద్యురాలిపై లైంగికదాడి చేసి, దారుణంగా హత్య చేశాడు. అతడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 12 , 2024 | 06:12 PM