Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:30 PM
కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు.
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక దాడులు, హింసాకాండకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని జేఎన్ రాయ్ ఆసుపత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశీ పేషెంట్లకు నిరవధికంగా వైద్య చికిత్సలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. బంగ్లాదేశీయులు భారత పతాకాన్ని అవమానించడంపై నిరసన తెలిపింది.
Eknath Shinde: షిండే అలక వెనుక కారణం ఇదే
కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని జేఎన్ రాయ్ ఆసుప్రతి ఉంది. ఇండియాకు జరుగుతున్న అవమానానికి నిరసనగా తాము బంగ్లాదేశీయులకు వైద్యచికిత్స అందించరాదనే నిర్ణయం తీసుకున్నట్టు ఆసుపత్రి అధికారి సుభ్రాన్షు భక్త్ తెలిపారు. ''ఈరోజు నుంచి బంగ్లాదేశ్ పేషెంట్లను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోవడం లేదు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై అకృత్యాల, త్రివర్ణపతాకాన్ని అగౌరవరపచినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని తెలిపారు. ఇతర ఆసుపత్రులు కూడా తమలాగే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
చిట్టగాంగ్‌లో దాడులు
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందూ ఆలయాలపై కొద్దికాలంగా వరుస దాడులు జరుగుతుండటంతో ఇరురుపొరుగు దేశాలైన బంగ్లా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారంనాడు కొందరు దుండగులు మూడు ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. హరీష్ చంద్ర మున్సిఫ్ లేన్ ఏరియాలో సనాతనేశ్వరి మాత్రి ఆలయం, షోని ఆలయం, సనాతనేశ్వరి కాలిబరి టెంపుల్‌పై దుండగులు ఇటుకలు విసురుతూ, హిందూ-ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. దాడి ఘటనను కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీమ్ ధ్రువీకరించారు. నష్టం తక్కువే అయినా ఉద్రిక్తతలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు తపన్ దాస్ మాట్లాడుతూ, జుమా ప్రార్థనల అనంతరం వందలాది మంది హిందూ-ఇస్కాన్ వ్యతిరేక నినాదులు చేశారని, పరిస్థితి విషమించడంతో ఆర్మీని పిలిపించడంతో పరిస్థితి సద్దుమణిగిందని చెప్పారు.
ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను రాజద్రోహం ఆరోపణలపై గత సోమవారం అరెస్టు చేయడంతో ఉద్రక్తతలు చోటుచేసుకున్నాయి. ఆయనకు బెయిలు నిరాకరించడంతో హిందూ కమ్యూనిటీకి చెందిన పలువురు ఢాకా, చిట్టగాంగ్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. బంగ్లాలో ఉద్రిక్తతలు పెరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన తెలిపింది. మైనారిటీలతో సహా ప్రజలందరి రక్షణ బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదేనని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. తీవ్రవాదం, హింసాకాండ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనీ, భారత్ ఆందోళనను బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు.
కోల్‌కతాలో నిరసనలపై బంగ్లాదేశ్ ఆందోళన
కాగా, కోల్‌కతాలోని తమ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వెలుపల నిరసనలు వ్యక్తం కావడంపై బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి
Special trains: క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు
Suburban trains: ఇక.. సబర్బన్ రైళ్లకు ఏసీ బోగీలు
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 30 , 2024 | 05:30 PM