Kolkata Sanjoy Roy: స్కూల్లో టాపర్.. భార్య చనిపోయింది.. ఆ తర్వాత..
ABN, Publish Date - Aug 23 , 2024 | 09:11 PM
కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 32 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి కఠిన శిక్ష విధించాలని అతడి తల్లి డమాండ్ చేశారు.
సంజయ్‌కు కఠిన శిక్ష విధించాలి
తండ్రి అంటే గౌరవం..
కోల్‌కతా, ఆగస్ట్ 23: కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 32 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కి కఠిన శిక్ష విధించాలని అతడి తల్లి డమాండ్ చేశారు. తన కుమారుడితో తాను చాలా కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఈ విధంగా వ్యవహరించి ఉండేవాడు కాదని అభిప్రాయపడ్డారు. తన భర్త అంటే సంజయ్ తండ్రి చాలా కఠినంగా ఉండేవారన్నారు. తన తండ్రి అంటే సంజయ్ రాయ్‌కు గౌరవ భావం ఉండేదని తెలిపారు.
Also Read: RG Kar Medical Hospital: వైద్యురాలి హత్యాచారం వేళ.. సీఎం మమత లేఖ వైరల్
తండ్రి చనిపోవడంతో..
ఆయన చినిపోవడంతో అంతా తలకిందులైపోయిందని పేర్కొన్నారు. తమ అందమైన కుటుంబం కాస్తా చిన్నభిన్నమై.. ఒక గుర్తుగా మిగిలిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే సంజయ్‌ని ఎవరు ప్రభావితం చేశారో తనకు తెలియదని.. కానీ ఈ కేసులో ఎవరైనా అతడిని ఇరికించినట్లయితే వారు తప్పకుండా శిక్షించబడతారని స్పష్టం చేశారు. శుక్రవారం కోల్‌కతాలో సంజయ్ రాయ్ తల్లి మీడియాతో మాట్లాడారు.
Also Read: Palnadu: మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ
Also Read: kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన
చిన్ననాటి సంగతులు చెప్పిన తల్లి..
చిన్నతనంలో సంజయ్ రాయ్‌కు ఆటలంటే చాలా ఇష్టమన్నారు. అలాగే బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడని గుర్తు చేసుకున్నారు. ఎన్‌సీసీలో కూడా చేరి... స్కూల్‌లో టాపర్‌గా నిలిచాడని చెప్పారు. ఇంట్లో తనను చాలా జాగ్రత్తగా చూసుకోవడమే కాదు.. వంట కూడా చేసి పెడతారన్నారు.
Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
ఇరుగు పొరుగు వారితో ఎప్పుడు...
ఇరుగు పొరుగు వారితో సంజయ్.. ఎప్పుడు అమర్యాదగా ప్రవర్తించ లేదని.. కావాలంటే వారినే సైతం అడగ వచ్చని మీడియా ప్రతినిధులకు సూచించారు. అలాంటి సంజయ్ ఈ విధంగా చేసిన ఉండడని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు కలిసి.. నువ్వు ఈ విధంగా ఎందుకు చేశావంటూ అతడిని ఆడగాలని ఉందన్నారు.
Also Read: Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం
భార్య మరణాన్ని తట్టుకో లేకపోయాడు..
ఇక సంజయ్ రాయ్ మొదటి భార్య క్యాన్సర్‌తో మరణించిందని చెప్పారు. అనంతరం అతడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడన్నారు. దాంతో మందుకు బానిసయ్యాడన్నారు. ఆ తర్వాత నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని చెప్పారు. ఇక ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన చోటు చేసుకున్న రోజు రాత్రి అతడు ఏం తినలేదని తెలిపారు. అక్కడ అతడు పని చేస్తున్న పని చేస్తున్న విషయం సైతం తనకు తెలియదని స్పష్టం చేశారు.
Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
అత్తగారి వాదన ఎలా ఉందంటే..
సంజయ్ మంచి వాడు కాదన్నారు. తన కుమార్తెను చెంప దెబ్బ కొట్టడంతో.. ఆమెకు గర్బస్రావం జరిగిందని చెప్పారు. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: Maharashtra: ఇక్బాల్‌కి కీలక పోస్టింగ్: విమర్శలకు దిగిన ప్రతిపక్షం
హత్య జరిగిన రోజు రాత్రి..
హత్యాచారం జరిగిన రోజు రాత్రి అతడు ఏం చేశాడు. ఎక్కడికి వెళ్లాడు. తదితర విషయాలన్నీ పోలీసులకు నిందితుడు సంజయ్ రాయ్ వివరించిన విషయం విధితమే.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 23 , 2024 | 09:12 PM