ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata rape and murder case: పాలీగ్రాఫ్ టెస్ట్‌లో సిబీఐ ప్రశ్నల పరంపర.. ఏం అడిగిందంటే..?

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:58 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది.

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అత్యాచారం, హత్య కేసు (Kolkata rape and murder case)లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురు వ్యక్తులపై సీబీఐ శనివారంనాడు పోలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు జైలులో పోలీగ్రాఫ్ టెస్ట్ జరపగా, సందీప్ ఘోష్, మరో నలుగురు డాక్టర్లను ఏజెన్సీ కార్యాలయంలో పరీక్షలు నిర్వహించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన పోలీగ్రాఫ్ స్పెషలిస్టులను ఢిల్లీ నుంచి కోల్‌కతా రప్పించారు.


ఆగస్టు 9న ఒంటిపై తీవ్రగాయాలతో ఆసుపత్రి సెమినార్ హాలులో ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ మరుసటి రోజు సంజయ్ రాయ్‌‌ని అరెస్టు చేశారు. ఆగస్టు 13న కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14న సీబీఐ ఇన్వెస్టిగేషన్ మొదలైంది.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి


సంజయ్ రాయ్‌ని సీబీఐ అడిగిన ప్రశ్నలివే..

పాలీగ్రాఫ్ పరీక్షల సమయంలో సంజయ్ రాయ్‌పై సీబీఐ 20 ప్రశ్నలు గుప్పించింది. నీ పేరు సంజయ్ రాయ్‌ కదా? నువ్వు కోల్‌కతాలో ఉంటావా? ఘటన జరిగిన రోజు ఆసుపత్రిలో ఉన్నావా? మోటారు సైకిల్ నడపడం నీకు తెలుసా? బాధితురాలిపై నవ్వు అత్యాచారం చేశావా? ఆమెను నువ్వు హత్య చేశావా? ఎప్పుడైనా నువ్వు అబద్ధం చెప్పావా? అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ వైద్యురాలు నీకు తెలుసా? ఈ హత్యలో నీతో పాటు ఎవరి ప్రమేయమైనా ఉందా? హత్య చేసిన తర్వాత ఆసుపత్రి నుంచి పరారయ్యావా? హత్యాచార బాధితురాలిని ఇంతకుముందు ఎప్పుడైనా వేధించావా? అశ్లీల చిత్రాలు చూస్తుంటావా? డాక్టర్ సందీప్ ఘోష్ నీకు తెలుసా? హత్య గురించిన సమాచారం సందీప్ ఘోష్‌కు చెప్పావా? హత్యకు ముందు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లావా? సెమినార్ హాలులో నీతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్పావా? సెమినార్ హాలులో నీ బ్లూటూత్ విరిగిందా? అడిగిన అన్ని ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పావా?... అని సీబీఐ ప్రశ్నించింది.


మాజీ ప్రిన్సిపాల్‌కు 25 ప్రశ్నలు

కాగా, సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సుమారు 25 ప్రశ్నలు అడిగింది. నిందితుడిని కన్‌ఫ్యూజ్ చేసేందుకు కొన్ని అనవసరమైన ప్రశ్నలు కూడా వేసింది. ఆకాశం రంగు ఏమిటి? ఇవాళ ఏ రోజు? వంటి ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. నీ పేరు సందీప్ అవునా? కోల్‌కతాలో ఎక్కడ పుట్టావు? ఘటన సమయంలో నువ్వు ఆసుపత్రిలోనే ఉన్నావా? ఇవాళ శనివారమేనా? హతురాలిపై అత్యాచారం జరిపినదెవరో నీకు తెలుసా? నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? ఆకాశం రంగు నీలంగా ఉంటుందా? ట్రైనీ డాక్టర్‌ను హత్య చేసిందెవరో నీకు తెలుసా? ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చావా? ఘటన జరిగిన రోజు ట్రైనీ డాక్టర్‌ను నువ్వు చూడటం కానీ, కలుసుకోవడం కానీ జరిగిందా? నీకు-హతురాలికి మధ్య ఎలాంటి విభేదాలైనా ఉన్నాయా? ఈ హత్యను ఆత్మహత్యగా బాధితురాలి కుటుంబ సభ్యులకు చెప్పావా? ఆలస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చావా? అవుననేదే సమాధానమైతే ఎందుకు? క్రైమ్ సీన్‌ను రెనొవేట్ చేసే ప్రయత్నం చేశావా? ఎందుకు చేశారు? ఎవరైనా అలా చేయమని చెప్పారా? ఎవరి ఆదేశాలతోనైనా హతురాలి కుటంబ సభ్యులకు సమాచారం ఇచ్చావా? సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని నీకు తెలియదా? ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకూ క్రైమ్ జరిగిన ప్రాంతంలో ఎలాంటి మార్పులు చేయరాదనే విషయం నీకు తెలియదా? ఘటన జరిగిన వెంటనే ఎందుకు రాజీనామా చేశారు? అంత హడావిడిగా రాజీనామా ఇవ్వడానికి కారణం ఏమిటి? రాజీనామా చేయమని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? ఘటన సమాచారం గురించి మీతో ఫోనులో మాట్లాడిందెవరు? సంజయ్ రాయ్ మీకు తెలుసా? తెలుసుంటే అతన్ని ఎన్నిసార్లు కలిసారు? ఆగస్టు 8-9 తేదీల్లో అతన్ని కలిసారా? అని సీబీఐ వరుస ప్రశ్నలు గుప్పించింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 04:02 PM

Advertising
Advertising
<