ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamata Banerjee: దీదీ.. మీకిది తగునా..?

ABN, Publish Date - Aug 18 , 2024 | 08:11 PM

నా బిడ్డ చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. నా బిడ్డ మృతికి న్యాయం జరగాలని ఆందోళన కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ద్వంద్వ విధానం అమలు చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మృతురాలి తండ్రి ప్రశ్నల వర్షం కురిపించారు.

Kolkata Rape Victim Father Fires On Mamata Banerjee

కోల్ కతా: కోల్ కతా ట్రైనీ డాక్టర్ మృతిపై ఆందోళనలు మిన్నంటాయి. వైద్యురాలి పేరంట్స్ మీడియా ముందుకు వచ్చారు. పశ్చిమ బెంగాల్ సర్కార్ తీరును తప్పు పట్టారు. సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ బిడ్డ మృతికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.



బానే మాట్లాడారు.. కానీ..?

‘నా బిడ్డ చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. నా బిడ్డ మృతికి న్యాయం జరగాలని ఆందోళన కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ద్వంద్వ విధానం అమలు చేస్తున్నారు. ప్రజలను చూస్తే మీకు భయం వేస్తోందా..? ఇదే అంశంపై నాకు పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. నా బిడ్డ చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. న్యాయం కోసం అందరూ రోడ్లమీదకొచ్చారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో బెంగాల్ ప్రభుత్వం ఉంది. స్వేచ్ఛగా నిరసన చేస్తోన్న వారి గొంతును మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారు. బెంగాల్ సీఎం రోడ్డుమీదకొస్తే ఇతరుల నిరసనలు చూసేందుకు ఇష్టపడటం లేదెమో అని’ మృతురాలి తండ్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.



మీరు ఆలోచించండి..

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరును బాధితురాలి తల్లి కూడా తప్పు పట్టారు. ‘కన్యశ్రీ, లక్ష్మీభాండర్ పథకాలు పొందుతున్న వారికి నేను చెబుతున్నది ఒక్కటే. ఆ పథకాలు సరే.. మీ భద్రత సంగతి ఏంటీ..? అలాంటి పథకాలతో ప్రయోజనం పొందుతారే తప్ప ఏ మాత్రం భద్రత ఉండదు. నా కూతురిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలి. ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పరిహారం తీసుకుంటాం అని’ వైద్యురాలి తల్లి స్పష్టం చేశారు. కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రి సమీపంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది సమావేశం కావొద్దని పోలీసులు స్పష్టం చేశారు. ఆ ఆదేశాలు అమల్లోకి వచ్చిన వెంటనే వైద్యురాలి తల్లి, తండ్రి మీడియాతో మాట్లాడారు. పశ్చి బెంగాల్ సర్కార్ అనుసరిస్తోన్న తీరును ఎండగట్టారు.


Also Read:
Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 18 , 2024 | 09:01 PM

Advertising
Advertising
<