Kolkata Doctor murder Case: ట్రైయినీ వైద్యురాలి కేసులో కీలక పరిణామం
ABN, Publish Date - Aug 12 , 2024 | 08:16 PM
నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
కోల్‌కతా, ఆగస్ట్ 12: నగరంలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో హత్యాచారం కారణంగా మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని.. ఆమె కుటుంబ సభ్యులకు తొలుత ఆసుపత్రి ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు విచారణలో తెలింది.
ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా కాలేజీ ఆసుపత్రిలోని ఛాతీ వైద్య విభాగాదిపతికి పోలీసులు సమన్లు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11.00 గంటలకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయానికి రావాలని సమన్లులో స్పష్టం చేశారు.
Also Read: Doctor's Murder Case: సీఎం మమతా బెనర్జీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
అలాగే ఈ రోజు ఉదయం ఏడుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు విచారించారు. ఆసుప్రతి ప్రాంగణంలో ట్రైయినీ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులకు ముందు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందిపై పోలీసులు దృష్టి సారించారు. అందులోభాగంగా వారిని విచారణకు హాజరుకావాలని వరుసగా సమన్లు అందజేస్తున్నారు.
Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా
అలాగే ఈ ఘటన చోటు చేసుకునే ముందు రోజు రాత్రి ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు.. వారి వివరాలను సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అదీకాక ఆసుపత్రి ఉన్నతాధికారులు.. ట్రైయినీ వైద్యురాలితో రాత్రి డిన్నర్ చేసిన గంటన్నర తర్వాత ఆమె హత్యాచారానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ ఆసుపత్రిలోని మరింత మంది వైద్య సిబ్బందికి పోలీసులు సమన్లు జారీ చేసే అవకాశముందని సమాచారం.
Also Read: Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ
ఇప్పటికే ఈ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సోషల్ మీడియాలో విమర్శలు అయితే వెల్లువెత్తాయి. ఈ తాకిడిని తట్టుకో లేక.. ఆయన సోమవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఈ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, మెడికల్ సూపరింటెండంట్ పదవి నుంచి సంజయ్ వశిష్టను మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదివారమే తొలగించిన విషయం విధితమే.
Also Read: Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..
శుక్రవారం తెల్లవారుజామున హత్యాచారానికి గురైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి నాలుగు పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని సెల్డా కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఆగస్ట్ 23వ వరకు కోర్టు రిమాండ్ విధించింది.
Also Read: Pune Airport: నకిలీ విమాన టికెట్లతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 12 , 2024 | 08:17 PM