Krishnachandra Patra : దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం
ABN, Publish Date - Aug 11 , 2024 | 03:48 AM
దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు.
ప్రారంభించిన ఒడిసా ప్రభుత్వం
ఒక్కసారి 25 కిలోల బియ్యం వచ్చేలా రూపకల్పన
భువనేశ్వర్, ఆగస్టు 10: దేశంలోనే మొట్టమొదటి ’రైస్ ఎటీఎం‘ను ఒడిసా ప్రభుత్వం ప్రారంభించింది. భువనేశ్వర్‌లోని మంచేశ్వర్‌లో ఓ గోదాములో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను ఆ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కృష్ణాచంద్ర పాత్ర ప్రారంభించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలోకి ఈ విధానాన్ని ప్రవేశపెట్టెందుకే ఈ మెషిన్‌ను రూపొందించారు.
రేషన్‌కార్డు ఉన్న వ్యక్తులు ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని పొందవచ్చు. మెషిన్ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేపై కార్డు నెంబర్‌ను ఎంటర్ చేసి, వినియోగదారుడి వేలిముద్రను వేయాలి.
అనంతరం మెషిన్‌లోంచి బియ్యం విత్‌డ్రా అవుతాయి. ఒక్కసారి 25 కిలోల బియ్యం వచ్చేలా రూపకల్పన చేశారు. ఈ విధానం ద్వారా ప్రజాపంపిణి వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి భువనేశ్వర్‌లో ప్రారంభించిన ఈతరహా ఏటీఎంలను తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాలకు విస్తరించనున్నారు. అనంతరం ‘ఒకే దేశం- ఒకే రేషన్‌కార్డు’ కింద వివిధ రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు.
Updated Date - Aug 11 , 2024 | 03:48 AM