PM Modi: Kumbha Mela: 'ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం' స్ఫూర్తితో మహా కుంభమేళా
ABN, Publish Date - Dec 13 , 2024 | 05:46 PM
ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమం (గంగ-యమున-సరస్వతి కలిసే చోటు)లో శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని అనంతరం జరిగిన 'మహాకుంభ్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రయాగరాజ్: కులమతాలకు అతీతంగా ప్రజలందర్నీ ఏకం చేసే మహా యజ్ఞమే కుంభమేళా (Kumbhamela) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ''ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం'' అనే సందేశాన్ని సంగమ స్నానం ద్వారా దేశవాసులు చాటుతారని అన్నారు. ఎంతరెందరో సాధువులు, సన్యాసులు, రుషులు, పండితులు, సాధారణ ప్రజానీకం కలిసికట్టుగా మూడు నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారని, కులాల మధ్య అంతరాయాలు, మత ఘర్షణలు ఇక్కడ మటుమాయమవుతాయని చెప్పారు. మహాకుంభమేళా ద్వారా దేశానికి, సమాజానికి సానుకూల సంకేతాలు వెళ్తాయన్నారు. ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమం (గంగ-యమున-సరస్వతి కలిసే చోటు)లో శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ప్రధాని అనంతరం జరిగిన 'మహాకుంభ్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్
వచ్చే ఏడాది జరిగే మహాకుంభ మేళా దేశ సంస్కృతి, ఆధ్యాత్మికతను సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. మహాకుంభ మేళా విజయవంతానికి పాటుపడుతున్న వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులను ప్రధాని అభినందించారు. ప్రయాగరాజ్ గడ్డ సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని అన్నారు. ఒకే మాటలో చెప్పాలంటే మహాకుంభమేళాతో జరిగే ఈ ఐక్యతా మహాయజ్ఞం గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటుందన్నారు. ఎలాంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లోనే మహాకుంభమేళా వంటి కార్యక్రమాలు సామాజిక మార్పులకు పునాది వేశాయని, ఇలాంటి సందర్భాలే దేశ ఐక్యతా సంకేతాన్ని దశదిశలా చాటుతాయని తెలిపారు.
కుంభ్, ఇతర మతపరమైన తీర్థయాత్రలను గత ప్రభుత్వాలు సరైన అవగాహన లేక నిర్లక్ష్యం చేశాయని ప్రధాని విమర్శించారు. భక్తులు అనేక ఇక్కట్లకు గురయ్యేవారని, కానీ ఈసారి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పుడు భారత సంస్కృతిని గౌరవించే ప్రభుత్వాలు అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఉన్నట్టు తెలిపారు. రాబోయే కుంభమేళాకు సౌకర్యాల కల్పనను డబుల్ ఇంజన్ గవర్న్‌మెంట్ ఒక బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు. కాగా, ప్రధానితో పాటు ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..
Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్ డ్రిల్
Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు
For National news And Telugu News
Updated Date - Dec 13 , 2024 | 05:46 PM