ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kupwara encounter: కుప్వారా ఎన్‌కౌంటర్‌లో జవాను మృతి, ఉగ్రవాది హతం

ABN, Publish Date - Jul 24 , 2024 | 07:59 PM

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. జవాన్ నాయక్ దిల్వార్ ఖాన్ ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాదానికి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా (Kupwara) జిల్లాలో ఎన్‌కౌంటర్ (encounter) చోటుచేసుకుంది. జవాన్ నాయక్ దిల్వార్ ఖాన్ ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఒక ఉగ్రవాదానికి భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై అందిన సమాచారం మేరకు కుప్వారాలోని లోలబ్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారంనాడు టెర్రరిస్టుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.


నిర్దిష్ట సమాచారం మేరకు కౌతువ్ ప్రాంతంలో భారత ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు జరుపుతుండగా మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని శ్రీనగర్‌కు చెందిన చినార్ కాప్స్ తెలిపారు. టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో బలగాలు తిప్పికొట్టాయని, ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడని చెప్పారు. ఒక ఉగ్రవాదిని కూడా బలగాలు మట్టుబట్టినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

jammu and kashmir: రాష్ట్రంలో మెరుగు పడ్డ శాంతి భద్రతలు


కాగా, ఈ ఏడాది జనవరి నుంచి జులై 15వ తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్లలో 10 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారంనాడు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి శకం ఆరంభమైందని, రాష్ట్రం పురోగమన దశలో ఉందని చెప్పారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 07:59 PM

Advertising
Advertising
<