వక్ఫ్ బిల్లును ఎట్టిపరిస్థితిల్లోనూ అడ్డుకుంటాం
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:07 AM
వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ ప్రకటించారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు చీఫ్ రెహ్మానీ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబరు 27: వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐఎంపీఎల్‌బీ హక్కులను పరిమితం చేసే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే దేశంలోని వక్ఫ్ ఆస్తులు పెద్ద మొత్తంలో ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ‘ఇది మాకు జీవన్మరణ సమస్య. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకుంటాం. అవసరమైతే నేరస్తులను ఉంచేందుకు ఖాళీ లేనంతగా జైళ్లను నింపేందుకు దేశంలోని ముస్లింలు సిద్ధం గా ఉన్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడబోం’ అని అన్నారు.
Updated Date - Oct 28 , 2024 | 04:07 AM