Rahul Gandhi :పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష నేత
ABN, Publish Date - Jun 10 , 2024 | 05:07 AM
కీలకమైన ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.
కాంగ్రె్‌సకు తగిన సీట్లు రావడంతో దక్కనున్న హోదా!
న్యూఢిల్లీ, జూన్ 9: కీలకమైన ‘లోక్‌సభలో ప్రతిపక్ష నేత’ స్థానం పదేళ్ల తర్వాత భర్తీ కానుంది. గత రెండుసార్లు కాంగ్రెస్ సహా మరే పార్టీ కనీస సంఖ్యలో సీట్లు సాధించకపోవడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడంతో అర్హత సాధించింది. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా.. ఇందులో పదిశాతం (54) సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష నేత పదవిని పొందే అవకాశం ఉంటుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లనే సాధించింది. 2019లో 52 స్థానాలతో సరిపెట్టుకుంది.
కాగా, రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉండాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. బీజేపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ ప్రధాని మోదీకి దీటైన నాయకుడిగా ఎదిగారని కాంగ్రెస్ పేర్కొంటోంది. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా పరంగానూ ప్రాధాన్యం ఉన్నది. సభలో సీట్లు, పార్లమెంటులో గదుల కేటాయింపు, అధికారిక దస్త్రాలను పొందే అవకాశం, పార్లమెంటరీ కమిటీల ఏర్పాటు, రోజువారీ సభా వ్యవహారాల్లో ఈ పదవి చాలా ముఖ్యం. అన్నిటికి మించి సీబీఐ, సీవీసీ, ఎన్నికల సంఘం, కేంద్ర సమాచార కమిషనర్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ వంటి అత్యంత ముఖ్యమైన పదవుల నియామక కమిటీల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా ఉంటారు. ఇక గత లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే ముగిసింది. ఈసారి మాత్రం ఆ పదవిని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుదలగా ఉంది.
Updated Date - Jun 10 , 2024 | 11:00 AM