Assembly Elections: రెండు రాష్ట్రాల్లో లీడ్‌లో ఉన్న ప్రముఖులు వీరే
ABN, Publish Date - Oct 08 , 2024 | 10:42 AM
హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్‌లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్, ఇండియా కూటమి.. తరువాతి ట్రెండ్స్‌లో బలహీనపడసాగింది.
ఇంటర్నెట్ డెస్క్: హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్‌లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్, ఇండియా కూటమి.. తరువాతి ట్రెండ్స్‌లో బలహీనపడసాగింది. జమ్మూలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. హరియాణాలో వెనకబడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. హరియాణాలో బీజేపీ 40కిపైగా స్థానాల్లో, కాంగ్రెస్ 30కిపైగా స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎవరు లీడ్‌లో, ఎవరు ట్రయల్‌లో ఉన్నారో తెలుసుకుందాం..
హరియాణా: లద్వాలో సీఎం నయాబ్ సైని ఆధిక్యం
హరియాణా: అంబాలా కంటోన్మెంట్‌లో అనిల్ విజ్ (BJP) ఆధిక్యం
హరియాణా: గర్హి సంప్లా-కిలోల్‌లో భూపీందర్ సింగ్ హూడా ఆధిక్యం
హరియాణా: జులానాలో వినేష్ ఫొగట్ ఆధిక్యం
హరియాణా: ఉచ్నా కలాన్‌లో దుష్యంత్ చౌతాలా వెనుకంజ
హరియాణా: కైథాల్‌లో ఆదిత్య సూర్జేవాలా (CONG) ఆధిక్యం
హరియాణా: సావిత్రి జిందాల్ (ఇండిపెండెంట్) ముందంజ
హరియాణా: ఎలీనాబాద్‌లో అభయ్ సింగ్ చౌతాలా (INLD) వెనుకంజ
హరియాణా: దబ్వాలీలో ఆదిత్య దేవీలాల్ (INLD) వెనుకంజ
హరియాణా: దబ్వాలీలో దిగ్విజయ్ సింగ్ చౌతాలా (JJP) వెనుకంజ
హరియాణా: రనియాలో అర్జున్ చౌతాలా (INLD) ఆధిక్యం
హరియాణా: ఆదమ్‌పూర్‌లో భవ్య బిష్ణోయ్ (BJP) వెనుకంజ
జమ్ముకశ్మీర్: గండర్‌బల్‌లో ఒమర్ అబ్దుల్లా ఆధిక్యం
జమ్ముకశ్మీర్: కుప్వారాలో సజ్జాద్ లోన్ వెనుకంజ
జమ్ముకశ్మీర్: నౌషేరాలో రవీందర్ రైనా (BJP) వెనుకంజ
జమ్ముకశ్మీర్: హంద్వారాలో సజాద్ గనిలోన్ (PDP) ముందంజ
Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..
Updated Date - Oct 08 , 2024 | 10:43 AM