Hindenburg Report: హిండెన్‌బర్గ్ నివేదికపై సెబీ చీఫ్ మాధబి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్
ABN, Publish Date - Aug 11 , 2024 | 11:56 AM
అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg report) వెల్లడించిన సమాచారం ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్‌లో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు(Madhabi Puri Buch) వాటా ఉందని, అందుకే వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
అమెరికన్ సార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక(Hindenburg report) వెల్లడించిన సమాచారం ప్రస్తుతం ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. అంతేకాదు భారతీయ స్టాక్ మార్కెట్‌లో కూడా ఈ అంశం కలకలం రేపుతోంది. అదానీకి చెందిన ఆఫ్‌షోర్ కంపెనీల్లో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు(Madhabi Puri Buch) వాటా ఉందని, అందుకే అదానీకి సంబంధించి గతంలో వెల్లడించిన విషయాలపై ఆమె చర్యలు తీసుకోలేదని తన నివేదికలో పేర్కొంది. అయితే మాధబి పూరీ బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ నివేదికలో చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని వారు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. మా జీవితం, ఆర్థిక విషయాలు తెరిచిన పుస్తకమన్నారు.
నిధులను
ఈ క్రమంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మార్కెట్ రెగ్యులేటర్ SEBIకి సంబంధించిన పలు ప్రశ్నలను లేవనెత్తింది. అదానీ గ్రూప్(adani group)లోని అనుమానిత ఆఫ్‌షోర్ షేర్‌హోల్డర్‌లపై అర్ధవంతమైన చర్య తీసుకోకపోవడానికి సెబీకి నిర్దిష్ట కారణం ఉందని అనుమానిస్తున్నట్లు అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం ఆరోపించింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఉపయోగించిన నిధులను ఉపయోగించడంలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బుచ్ కుమ్మక్కయి ఉండవచ్చని తెలిపింది. ఈ విషయంలో అదానీ గ్రూప్, సెబీ చీఫ్ మధ్య సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. మా దృష్టిలో సెబీ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని హిండెన్‌బర్గ్ వెల్లడించింది.
మోసగాళ్లను రక్షించేందుకు
మోసగాళ్ల నుంచి పెట్టుబడిదారులను రక్షించడం కంటే, మోసగాళ్లను రక్షించేందుకు సెబీ(SEBI) ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ క్లెయిమ్‌ల ప్రకారం ఆమె కన్సల్టింగ్ సంస్థ ఆదాయం సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్ జీతం కంటే చాలా రెట్లు ఎక్కువ అని తెలిపింది. భారతీయ కన్సల్టింగ్ బిజినెస్ అగోరా అడ్వైజరీ మాధబి బుచ్ యాజమాన్యంలో ఉంది. ఈ కంపెనీలో ఆమెకు 99 శాతం వాటా ఉంది.
జనవరి 24, 2023న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌కి సంబంధించి ఒక నివేదికను ప్రచురించింది. నివేదిక తర్వాత, అదానీ గ్రూప్ షేర్లలో భారీ పతనం జరిగింది. అయితే తర్వాత మాత్రం కంపెనీ కోలుకుంది. ఈ నివేదికకు సంబంధించి ఇండియన్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) హిండెన్‌బర్గ్‌కు 46 పేజీల షోకాజ్ నోటీసును కూడా పంపింది.
తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అదానీకి సంబంధించిన సెబీ దర్యాప్తులో అన్ని వైరుధ్యాలను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. దేశంలోని అత్యున్నత అధికారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని జైరాం రమేష్ తెలిపారు.
రాజీనామా చేయాలి
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొత్త నివేదిక తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నేత ఐపి సింగ్ సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతిపెద్ద దొంగ సెబీ కుర్చీలో కూర్చున్నారని ఎస్పీ నేత ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే సెబీ చైర్మన్ మాధవి బుచ్‌ను తొలగించాలన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 9 గంటలలోపు రాజీనామా చేయాల్సిందిగా సెబీ చైర్మన్‌ను ప్రధాని ఆదేశించాలని ఐపీ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
సీబీఐ దర్యాప్తు చేస్తారా
తృణమూల్ కాంగ్రెస్ కూడా సెబీ చీఫ్ రిజైన్ చేయాలని డిమాండ్ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిని అదానీ స్టైల్‌గా పేర్కొంటూ సెబీ ఛైర్మన్ కూడా తన గ్రూపులో పెట్టుబడిదారులేనని ఆరోపించారు. ఈ అంశంపై సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌ను ట్యాగ్ చేసి, POCA చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!
Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Aug 11 , 2024 | 11:59 AM