ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ద్రావకం పోసేందుకు యువకుడి యత్నం

ABN, Publish Date - Nov 30 , 2024 | 08:25 PM

కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై దాడి యత్నం జరిగింది. గ్రేటర్ కైలాస్‌ ఏరియాలో కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా దగ్గరగా వచ్చిన ఓ యువకుడు ద్రావకం (liquid) పోసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకున్నారు. అయితే ఆ సరికే ద్రావకం చుక్కలు కొన్ని ఆయన దుస్తులపై పడ్డాయి. ఆప్ కార్యకర్తలు నిందితుడిని పట్టుకున్న వెంటనే పోలీసులకు అప్పగించారు.

Eknath Shinde: వైరల్ ఫీవర్‌తో షిండేకు అస్వస్థత


కాగా, ఆ యువకుడు ఎవరు, అతని చేతిలోని ద్రావకం ఏమిటనేది వెంటనే తెలియలేదు. దాడికి ప్రయత్నించడానికి కారణం ఏమిటనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ రాజకీయ నాయకులు బహిరంగ ప్రచారానికి వెళ్లినప్పుడు వారికి భద్రత కొరవడుతోందనే ఆందోళనలను పెంచింది.


ఇదే మొదటిసారి కాదు..

కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు. 2025 ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో 'ఆప్' ఎజెండాను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కేజ్రీవాల్ తాజాగా పాదయాత్ర చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Eknath Shinde: షిండే అలక వెనుక కారణం ఇదే

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు

Suburban trains: ఇక.. సబర్బన్‌ రైళ్లకు ఏసీ బోగీలు

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 30 , 2024 | 08:25 PM