ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor stores: మద్యం దుకాణాల తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు..

ABN, Publish Date - Oct 04 , 2024 | 01:00 PM

మద్యపాన నిషేధంపై నలువైపుల నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందా?.. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దుకాణాలను తగ్గించడంపై కసరత్తు చేస్తోందా?.. ఈ నెల 8వ తేదీ జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ‘కీలక నిర్ణయం’ తీసుకోనున్నారా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

- 8న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ?

చెన్నై: మద్యపాన నిషేధంపై నలువైపుల నుంచి వస్తున్న ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గుతోందా?.. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దుకాణాలను తగ్గించడంపై కసరత్తు చేస్తోందా?.. ఈ నెల 8వ తేదీ జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ‘కీలక నిర్ణయం’ తీసుకోనున్నారా?.. అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అభీష్టం మేరకు కనీసం 500 దుకాణాలను తగ్గించే యోచనలో ప్రభుత్వం వున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో ఈ నెల 8వ తేదీ మంత్రివర్గ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయనిధి ఉపముఖ్యమంత్రిగా, మంత్రివర్గ విస్తరణ తరువాత జరుగనున్న ఈ తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: నేడు అల్పపీడనం.. పలుచోట్ల వర్షాలు కురిసే అవకావం


మత్తు పదార్థాల నిర్మూలన, మద్యపాన నిషేధంపై నలువైపుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న తరుణంలో.. మద్యం దుకాణాలు తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని గురించి మంత్రివర్గ విస్తరణలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 4,829 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో ఎఫ్‌ఎల్‌-2, ఎఫ్‌ఎల్‌-3 షాపులు 1685 వున్నాయి. ఇవి గాక 400 వైన్‌ షాపులకు అనుమతి కోరుతూ వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లోనే వున్నాయి. ఈ సందర్భంగాలో 500 మద్యం దుకాణాలను మూసివేయడంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రాష్ట్రంలో మద్య నిషేధం కావాలని పలు పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.


గతంలో ప్రతిపక్షంలో ఉండగా డీఎంకే సైతం మద్యం దుకాణాలను తీసేయాలని, వంతుల వారీగా మద్య నిషేధం చేపట్టాలని డిమాండ్‌ చేసింది. బుధవారం ఉళుందూర్‌పేటలో డీపీఐ నేతృత్వంలో జరిగిన మద్యపాన నిర్మూలన మహానాడు కూడా ఇదేవిధమైన డిమాండ్‌ చేసింది. ఇక ప్రతిపక్ష అన్నాడీఎంకే అయితే మద్యపాన నిషేధంపై డీఎంకే ప్రభుత్వం మాట తప్పిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిపోయిందంటూ దుమ్మెత్తి పోస్తోంది. పీఎంకే అయితే ఆదినుంచే మద్యపాన నిషేధం కోసం డిమాండ్‌ చేస్తోంది.


రాష్ట్ర ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో అవగాహనా సమావేశాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా అనేకమంది గళమెత్తుతుండడంతో కొన్ని దుకాణాలనైనా మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. అంతేగాక మంత్రివర్గ సమావేశంలో ... మహిళలకు రూ.1000, పుదుమైపెణ్‌, తమిళ్‌ ముదల్వన్‌ పథకాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.


1న రూ.220 కోట్లకు మద్యం విక్రయాలు

జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 2వ తేదీ మద్యం దుకాణాలు మూసివేసిన విషయం తెలిసిందే. అయితే మద్యంపై ముందుగానే మేల్కొన్న మందుబాబులు ఒక్కరోజు ముందుగా మద్యం కొనుగోలు చేశారు. దీంతో ఈ నెల 1వ తేదీ ఒక్కరోజే రూ.220 కోట్లకు మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో రోజురోజుకు మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. పండుగ రోజుల్లో వీటికి హద్దే లేకుండాపోతోంది. 1వ తేదీ చెన్నై మండలంలో రూ.53 కోట్లకు, కోయంబత్తూరు మండలంలో రూ.39 కోట్లు, మదురై మండలంలో రూ.43 కోట్లు, తిరుచ్చి మండలంలో రూ.41 కోట్లు, సేలం మండలంలో రూ.38 కోట్లకు విక్రయాలు జరిగాయి. అయితే 2023 అక్టోబరు 1వ తేదీన రూ.245 కోట్లకు మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.25 కోట్లు అమ్మకాలు తగ్గినట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు.


ఇదికూడా చదవండి: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

ఇదికూడా చదవండి: మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

ఇదికూడా చదవండి: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

ఇదికూడా చదవండి: Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2024 | 01:00 PM