Bharat ratna Awards: మోదీ హయాంలో ఎందరికి భారతరత్నలు..?
ABN, First Publish Date - 2024-02-09T16:16:57+05:30
ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో అవార్డులు స్థాపించిన తరువాత అత్యధికులకు భారతరత్న అవార్డు ప్రకటించిన ఏడాది 2024 కాడం విశేషం.
న్యూఢిల్లీ: ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' (Bharat Ratna) ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో అవార్డులు స్థాపించిన తరువాత అత్యధికులకు భారతరత్న అవార్డు ప్రకటించిన ఏడాది 2024 కాడం విశేషం. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అత్యథికంగా ఏడాదిలో నలుగురికి భారతరత్న ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే సారథ్యంలోని మోదీ సర్కార్ పదేళ్ల పాలనలో 10 మందిని భారతరత్న వరించింది.
2015: మదన్ మోహన్ మాలవీయ
2015: అటల్ బిహారీ వాజ్‌పేయి
2019: ప్రణబ్ ముఖర్జీ
2019: నానాజీ దేశ్‌ముఖ్
2019: భూపెన్ హజారికీ
2024: కర్పూరి ఠాకూర్
2024: లాల్ కృష్ణ అడ్వాణి
2024: చౌదరి చరణ్ సంగ్
2024: పీవీ నరసింహారావు
2024: డాక్టర్ ఎం.ఎస్.స్వా్మినాథన్
Updated Date - 2024-02-09T16:42:29+05:30 IST