ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LK Advani: ఎల్‌కే అడ్వాణి పరిస్థితిపై హెల్త్ బులిటెన్

ABN, Publish Date - Dec 17 , 2024 | 09:48 PM

అడ్వాణీ డిసెంబర్ 12వ తేదీ నుంచి వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.

న్యూఢిల్లీ: అస్వస్థతతో ఇటీవల ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అడ్వాణి (LK Adavani) ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఐసీయూ (ICU) నుంచి జనరల్ వార్డుకు షిప్ట్ చేస్తామని ఆసుపత్రి వర్గాలు మంగళవారంనాడు తెలిపారు.

Constitution Debate: భావ ప్రకటనా స్వేచ్ఛను హరించిన నెహ్రూ, ఇందిర


అడ్వాణీ డిసెంబర్ 12వ తేదీ నుంచి వయో సంబంధిత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తామని తాజా హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. గత అక్టోబర్‌లో కూడా అడ్వాణి వైద్య పరీక్షల నిమిత్తం ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో చేరారు. దీనికి ముందు జూలై 3న స్వల్పకాలం ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. ఈ ఏడాది మొదట్లో ఎయిమ్స్‌లో ఆయనకు రాత్రికి రాత్రి వైద్య పరీక్షలు చేసి డిశ్చార్చి చేశారు.


తొంభై ఏడేళ్ల అడ్వాణి ఈ ఏడాది మార్చిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఈ పురస్కారాన్ని అందజేశారు. కరాచీ (ప్రస్తుతం పాకిస్థాన్‌‌లో ఉంది)లో 1927 నవంబర్ 8న జన్మించిన అడ్వాణి 1942లో ఆర్ఎస్ఎస్‌లో స్వయం సేవక్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1986 నుంచి 1990, 1993 నుంచి 1998, 2004 నుంచి 2005 వరకూ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఉప ప్రధానిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా అడ్వాణి పనిచేశారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా, నేడు బంగ్లా బ్యాగ్‌

Kasturi: గర్భాలయంలోకి ఎవరికీ ప్రవేశం లేదు..

Ajit Doval: చైనా పర్యటనకు అజిత్ ఢోబాల్

For National News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 09:53 PM