Lok sabha Elections 2024: ఎన్డీయేకు భారీగా తగ్గుతున్న మెజారిటీ.. చంద్రబాబు, నితీష్ కుమార్ కీలకం!
ABN, Publish Date - Jun 04 , 2024 | 03:14 PM
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
గత పదేళ్లుగా తిరుగు లేని ఆధిపత్యంతో దేశాన్ని పాలించిన బీజేపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. 350 స్థానాలు గ్యారెంటీ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన జోస్యాలు నిజం కాలేదు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ మీద ఆధారపడాల్సి ఉంటుంది. విచిత్రమేమిటంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే ఎన్డీయేలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరి సహకారంతోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది.
ప్రస్తుతానికి బీజేపీ 237 సీట్ల ఆధిక్యంలో ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ 272. అంటే బీజేపీకి 35 సీట్లు మిత్రపక్షాల నుంచి అవసరం పడుతుంది. ప్రస్తుతానికి టీడీపీ 16 సీట్లలోనూ, జేడీయూ 15 సీట్లలోనూ ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. కూటమిలోని మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుంటే ఎన్డీయే ఆధిక్యం ప్రస్తుతానికి 290 సీట్లలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే 3.0 ఏర్పడాలంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్ధతు తప్పనిసరిగా మారిపోయింది.
Updated Date - Jun 04 , 2024 | 03:14 PM