ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

ABN, Publish Date - May 28 , 2024 | 02:33 PM

రామభక్తులు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు కూడా రామమందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు.

గోరఖ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చివరియత్నంగా అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తన మాటల వాగ్దాటిని కొనసాగిస్తూ ఈసారి ఎన్నికల సమరం ఎవరి మధ్య జరుగుతోందో తేల్చిచెప్పారు. రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకమని, రామభక్తుడు అయినందునే అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వీర్ బహదూర్ సింగ్‌ను కాంగ్రెస్ తొలగించిందని విమర్శించారు. రామభక్తులు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం మాట్లాడుతూ, ఈరోజుకు కూడా రామమందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు.

PM Modi: రాహుల్, కేజ్రీలకు వారి సపోర్ట్.. విచారణ జరపాలన్న ప్రధాని మోదీ..


రామభక్తుడే ఢిల్లీ సింహాసనాన్ని పాలించాలి..

రామభక్తుడే ఢిల్లీ సింహాసనంపై కూర్చుని దేశాన్ని పాలించాలని యోగి స్పష్టం చేశారు. గోరఖ్‌పూర్‌కు ప్రత్యేకత ఉందని, 1986లో ఇక్కడి నుంచే రామమందిరం తాళాలను తెరిచారని, అదికూడా వీర బహదూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని చెప్పారు. మోదీని, బీజేపీని ఇంతగా ప్రజలు ఎందుకు ప్రేమిస్తున్నారని తాను కొందరిని ప్రశ్నించానని, రామభక్తులనే తాము అభిమానిస్తామని, వారికే పట్టం కడతామని వారు జవాబిచ్చారని చెప్పారు. రామాలయం భారతదేశం ఆత్మకు గుర్తని యోగి చెప్పారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రెండూ రామాలయానికి వ్యతిరేకులని, రామభక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికల సమరం ఇదని స్పష్టం చేశారు.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 02:43 PM

Advertising
Advertising