ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: అయోధ్య ప్రారంభోత్సవం.. క్లాక్ టవర్‌పై శ్రీ రాముడి చిత్ర ప్రదర్శన.. వీడియో ఇదిగో!

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:50 AM

అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు అందరి దృష్టి రామాలయం ప్రారంభోత్సవం మీదనే ఉంది. పవిత్ర దినం జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది.

డెహ్రాడూన్: అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు అందరి దృష్టి రామాలయం ప్రారంభోత్సవం మీదనే ఉంది. పవిత్ర దినం జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లోని క్లాక్ టవర్‌పై లేజర్ లైట్ ద్వారా శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. డెహ్రాడూన్‌లో రద్దీగా ఉండే రోడ్డు మార్గంలో క్లాక్ టవర్‌పై ప్రదర్శించిన శ్రీరాముడి చిత్రాల లేజర్ షో చూపరులను ఆకట్టుకుంది. శ్రీరాముడి చిత్రాలు మాత్రమే కాకుండా, శ్రీరాముడు సీతమ్మ తల్లితో ఉన్న చిత్రాలు, ఆంజనేయస్వామితో ఉన్న చిత్రాలను క్లాక్ టవర్‌పై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన 47 సెకన్ల వీడియోను ఏఎన్‌ఐ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.


కాగా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏడు రోజుల వైదిక ఆచారాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే ఆలయంలో ప్రతిష్టించే రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా చెప్పారు. రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకురావడానికి ముందే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం ఆలయంలో తీర్థ పూజ, జల యాత్ర, గంధాదివాస్ వంటి అనేక ఆచారాలు జరగనున్నాయి. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా నాలుగో రోజున ఉదయం ఔసధాధివస్, కేశరాధివస్, ఘృతాధివాసం, సాయంత్రం ధాన్యాధివస్మృతి కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం ఉదయం శర్కరాధివస్, ఫలాధివస్ర్తాలు, సాయంత్రం పుష్పాధివాసం నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చివరి రోజైన ఆదివారం సంప్రోక్షణకు ఒకరోజు ముందు ఉదయం మధ్యాధివాసుల క్రతువు, సాయంత్రం శయ్యాధివాసం జరుగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 11:57 AM

Advertising
Advertising