ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lord Ram: రాముడు మాంసాహారే.. కాక రేపుతున్న జితేంద్ర కామెంట్స్..

ABN, Publish Date - Jan 04 , 2024 | 10:04 AM

దేశం మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న సమయంలో.. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత జితేంద్ర అవద్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి.

దేశం మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న సమయంలో.. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత జితేంద్ర అవద్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. అయోధ్య మందిరం ప్రారంభించనున్న జనవరి 22ను డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 14 సంవత్సరాలు అడవిలో నివసించిన వ్యక్తి నాన్ వెజ్ తినకుండా.. శాకాహారమే ఎలా తినగలిగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉంటే, శివసేనకు చెందిన సామ్నా వార్తాపత్రికలో 'రామ్ మాంసాహారం' అంశంపై విమర్శనా వ్యాసాలు రాసేదని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ అన్నారు. ఎన్నికలు రాగానే హిందుత్వం గురించి మాట్లాడతారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

తన వ్యాఖ్యలపై జితేంద్ర అవద్ స్పందించారు. రాముడు ఏమి తిన్నాడనే విషయంపై వివాదం ఎందుకున్న ఆయన.. రాముడు క్షత్రియుడు. కాబట్టి క్షత్రియులు మాంసాహారులు. వారు తప్పకుండా నాన్ వెజ్ ను తిన్నారన్నారు. అంతే కాకుండా తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, దేశ జనాభాలో 80% మంది మాంసాహారులు, వారు కూడా రామభక్తులు అని చెప్పడం కొసమెరుపు.

కాగా.. రాముడు శాకాహారి కాదన్న అవద్ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. అతని వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు నిరసనలు చేస్తున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 10:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising