Madhya Pradesh: మంత్రి అనుచరుడిపై ఆగంతకుల కాల్పులు
ABN, Publish Date - Jun 23 , 2024 | 01:48 PM
మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్ వర్గియ అనుచరుడు మోను కల్యాణేపై ఈ రోజు ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇండోర్‌లో గల ఛిమన్‌బాగ్ ప్రాంతంలో వాహనానికి బ్యానర్లు, పోస్టర్లు కట్టే సమయంలో ఫైరింగ్ జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు మోనును నంబర్ అడిగారు. మొబైల్ తీసి చూస్తుండగా బైక్ వెనకాల న్న వ్యక్తి పిస్టోల్ తీసి మోను ఛాతీలో కాల్చాడు.
ఇండోర్: మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్ వర్గియ అనుచరుడు (Madhya Pradesh Minister Kailash Aide) మోను కల్యాణేపై ఈ రోజు ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇండోర్‌లో గల ఛిమన్‌బాగ్ ప్రాంతంలో వాహనానికి బ్యానర్లు, పోస్టర్లు కట్టే సమయంలో ఫైరింగ్ జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు మోనును నంబర్ అడిగారు. మొబైల్ తీసి చూస్తుండగా బైక్ వెనకాల న్న వ్యక్తి పిస్టోల్ తీసి మోను ఛాతీలో కాల్చాడు. దగ్గరి నుంచి ఫైర్ చేయడం, ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో మోను తీవ్రంగా గాయపడ్డారు. అతని స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మోను చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.
బీజేపీ యువమోర్చా
మోను కల్యాణే ఇండోర్ బీజేపీ యువ మోర్చా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తమ కాలనీలో బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతుంటారు. మంత్రి కైలాశ్ విజయ్ వర్గియ, అతని కుమారుడు ఆకాశ్ విజయ్ వర్గియకు మోను సన్నిహితంగా ఉంటారు.
వారిద్దరే..!!
కాల్పులు జరిపింది మోను చుట్టుపక్కల ఉండే పీయూష్, అర్జున్ అని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మోనుతో వారికి ఎప్పటినుంచో శత్రుత్వం ఉందని వివరించారు. ఇద్దరు పరారీలో ఉన్నారని, పట్టుకునేందుకు తమ బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. మోను మృతిపై మంత్రి కైలాష్ విజయ్ వర్గియ సంతాపం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మోను మృతి ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు.
Updated Date - Jun 23 , 2024 | 01:52 PM