ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National News: భర్తలతో మద్యం మానిపించడం ఎలా.. భార్యలకు మధ్యప్రదేశ్ మంత్రి చిట్కాలు..

ABN, Publish Date - Jun 29 , 2024 | 12:29 PM

ఇంట్లో భార్యలు ఎక్కువుగా ఇబ్బంది పడే సమస్యల్లో ఒకటి.. తన భర్త ఎక్కువుగా మద్యం తాగుతున్నారని.. అలాగే కేవలం భర్తలే కాదు.. కుటుంబంలో ఎవరైన సభ్యులు మద్యానికి బానిసగా మారితే ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

Narayan Singh Kushwaha

ఇంట్లో భార్యలు ఎక్కువుగా ఇబ్బంది పడే సమస్యల్లో ఒకటి.. తన భర్త ఎక్కువుగా మద్యం తాగుతున్నారని.. అలాగే కేవలం భర్తలే కాదు.. కుటుంబంలో ఎవరైన సభ్యులు మద్యానికి బానిసగా మారితే ఆ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వ్యక్తి ఆరోగ్యం పాడువుతుందని ముఖ్యంగా ఆందోళన చెందుతారు. మద్యం మాన్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివారికి మధ్యప్రదేశ్ రాష్ట్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా ఓ సలహా ఇచ్చారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంపై జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పురుషులు మద్యపాన వినియోగాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పద్ధతిని ప్రతిపాదించారు. తమ ఇంట్లో పురుషులు బయట కాకుండా ఇంట్లో తాగాలని మహిళలు అడగాలని మంత్రి నారాయణ్ సింగ్ సూచించారు.

Parliament : నీట్‌పై దద్దరిల్లిన పార్లమెంటు


బోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ ఇంట్లో పురుషులు.. ముఖ్యంగా తమ భర్తలు మద్యం తాగకూడదని భార్యలు కోరుకుంటారని.. అలా అనుకునేవారు ముందుగా బయట తాగవద్దని.. అవసరమైతే ఇంటికి తీసుకొచ్చి మద్యం తాగాలని చెప్పాలని.. తద్వారా మద్య వినియోగం క్రమంగా తగ్గుతుందన్నారు. చివరికి తమ భార్యలు, పిల్లల ముందు మద్యం తాగడానికి సిగ్గుపడతారని.. ఈ విధంగా మద్యానికి దూరమవుతారని తెలిపారు.


మంత్రి ప్రకటనపై కాంగ్రెస్..

మధ్యప్రదేశ్ మంత్రి కుష్వాహా ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ మీడియా విభాగం నుంచి ముఖేష్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి ఉద్దేశం సరైనదే అయినప్పటికీ.. ఆయన చెప్పే విధానం సరికాదన్నారు. ఇంట్లో మద్యం తాగడం వల్ల గొడవలకు, గృహహింసలకు కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్నారు. దీనికి బదులుగా అసలు మద్యం తాగకూడదనే సలహా ఇచ్చి ఉండాల్సిందని కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.


Ajith category MLAs : అజిత్‌ వర్గం ఎమ్మెల్యేలు తిరిగి పవార్‌ గూటికి?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - Jun 29 , 2024 | 12:29 PM

Advertising
Advertising