ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వ్యభిచారంపై వింత పిటిషన్.. ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు.. చివరకు షాకింగ్ తీర్పు

ABN, Publish Date - Jul 25 , 2024 | 09:37 PM

మన భారతదేశంలో వ్యభిచారం అనేది చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకు చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశాడు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు గాను రక్షణ కల్పించాలని..

Madras High Court

మన భారతదేశంలో వ్యభిచారం అనేది చట్టవిరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకు (Tamilnadu) చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశాడు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు గాను రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతేకాదు.. పోలీసులు తనపై పెట్టిన కేసుని సైతం కొట్టివేయాలని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను చూసి ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు (Madras High Court).. అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికప్పుడే అతని పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే.. అతనికి భారీ జరిమానా కూడా విధించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


వ్యభిచారం నడిపేందుకు రక్షణ కల్పించండి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన రాజా మురుగన్ అనే న్యాయవాది.. స్థానికంగా ఒక వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. అయితే.. ఇటీవల పోలీసులు జరిపిన దాడుల్లో అతను రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. ఈ నేపథ్యంలోనే.. వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా.. మేజర్ అయిన యువతీ యువకులు ఏకాభిప్రాయంతో శృంగారం చేయడం అనేది చట్టవిరుద్ధం కాదని పిటిషనర్ వాదించాడు. అంతేకాదు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని, తన వ్యభిచార కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని కోరాడు. తన చర్యలను నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు.


పిటిషన్ కొట్టేసిన మద్రాసు హైకోర్టు

ఈ పిటిషన్‌ను చూసి షాక్ తిన్న జస్టిస్ బీ పుగలేంధీ ధర్మాసనం.. పిటిషనర్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. అతని పిటిషన్‌ని కొట్టివేస్తూ.. రూ.10 వేల జరిమానా కూడా విధించింది. అలాగే.. ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్‌ను కోరింది. ‘‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట దిగజారుతోందన్న విషయాన్ని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇకనుంచైనా.. పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసుకునేలా బార్ కౌన్సిల్ సభ్యులు చూసుకోవాలి. ఇతరరాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్‌ల నమోదుని పరిమితం చేయాలని కూడా బార్ కౌన్సిల్‌ను న్యాయస్థానం సూచించింది.

ఇదే సమయంలో.. మురుగన్ న్యాయ విద్య, బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని ధృవీకరించడానికి అతని ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్, లా డిగ్రీని సమర్పించాలని న్యాయస్థానం డిమాండ్ చేసింది. ఇందుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బదులిస్తూ.. మురుగన్ బీ-టెక్ గ్రాడ్యుయేట్ అని, ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌తో బార్ కౌన్సిల్ గుర్తింపుని కలిగి ఉన్నారని తెలిపారు. అయితే.. అతను న్యాయ విద్య చదివాడా? లేదా? అనేది తాము ధృవీకరించలేకపోయామని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 09:37 PM

Advertising
Advertising
<