Maharashtra Assembly Elections 2024: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం
ABN, Publish Date - Aug 01 , 2024 | 02:37 PM
మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో 35 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జ్‌ను నియమించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 01: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో 35 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌చార్జ్‌ను నియమించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అగాడి కూటమిలోని కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. దాంతో మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలను గాను ఆ యా పార్టీలు సీట్లను పంచుకొని.. అభ్యర్థులను బరిలో నిలుపనున్నాయి.
Also Read: Viral Video: కొత్త పార్లమెంట్ భవనంలో వర్షం లీక్.. స్పందించిన ప్రతిపక్షాలు
ఇంకోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో బుధవారం ఆ పార్టీలోని కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్ర పక్షాలతో సీట్లు పంపకాలు, అలాగే ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్ 7వ తేదీన మహారాష్ట్ర వికాస్ అగాడీలోని రాజకీయ పార్టీలన్నీ సమావేశమై.. సీట్ల అంశాన్ని ఒక కొలుక్కి తీసుకు వచ్చే అవకాశముందని సమాచారం.
Also Read: RajyaSabha: రాజ్యసభలో ‘నమో నగర్’ కోసం ప్రైవేట్ బిల్లు
అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముహుర్తం ఖరారు చేసింది. ఆగస్ట్ 20వ తేదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టునుంది. ఈ ప్రచార కార్యక్రమంలో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనున్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు మంద కృష్ణ మాదిగ ధన్యవాదాలు
Also Read: Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక
ఇక 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీలు 44 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్సీపీ, శివసేన పార్టీలు నిట్ట నిలువునా చీలిపోయాయి. దీంతో మహాయుతి కూటమిగా శివసేన ఏకనాథ్ సారథ్యంలోని షిండే వర్గం, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికారాన్ని చేపట్టాయి. అయితే ఈ సారి మాత్రం మహారాష్ట్ర ప్రజలు ఏ కూటమికి పట్టం కట్టతారనేది ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తేటతెల్లం కానుంది.
Also Read: Himachal Pradesh: భారీ వర్షాలు.. ఒకరు మృతి, 32 మంది గల్లంతు
Also Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 01 , 2024 | 02:37 PM