ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: మంత్రివర్గ విస్తరణ తేదీ వచ్చేసింది

ABN, Publish Date - Dec 13 , 2024 | 08:59 PM

నాగపూర్‌లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. 30 మందికి పైగా మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

ముంబై: బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)కు సిద్ధమవుతోంది. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడనుంది. డిసెంబర్ 15న తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగనుందని, నాగపూర్‌లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. 30 మందికి పైగా మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. వారం రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశం డిసెంబర్ 16 నుంచి నాగపూర్‌లో జరుగనుంది.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యల వివాదం.. రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు


అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రెండు వారాలకు పైగా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ డిసెంబర్ 5న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ సైతం ప్రమాణస్వీకారం చేశారు. సీఎంతో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య గరిష్టంగా 43 మంది వరకూ ఉండవచ్చు.


బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 235 స్థానాలతో విజయభేరి మోగించింది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కేవలం 49 సీట్లతో చతికిలపడింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చింది. సీఎం ఎవరనే విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కూడా తొలగడంతో ఫడ్నవిస్ సీఎం పగ్గాలు చేపట్టగా, గత బీజేపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టారు. హోం శాఖను షిండే ఆశిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడిన క్రమంలో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు హోం శాఖ అప్పగిస్తారా, సీఎం తన వద్దనే ఆ కీలక శాఖను ఉంచుకుంటారా అనేది చూడాల్సి ఉంది.


ఇది కూడా చదవండి..

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

For National news And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 08:59 PM