ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ujjain Temple Row: వివాదంలో చిక్కుకున్న సీఎం కుమారుడు

ABN, Publish Date - Oct 18 , 2024 | 07:02 PM

కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ షిండే గురువారం సాయంత్ర భార్య, మరో ఇద్దరితో కలిసి ఆలయ గర్భగుడిలో పూజలు చేసినట్టు ఆలయ వర్గాల సమాచారం.

ఉజ్జయిని: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections)వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే (Shrikant Shinde) వివాదంలో చిక్కుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయం (Mahakaleshwar Temple) గర్భగుడిలోకి శ్రీకాంత్ షిండేను అనుతించడం ఈ వివాదానికి కారణమైంది. సుమారు ఏడాది కాలంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశంపై నిషేధం ఉండగా, సీఎం కుమారుడిని ఎలా అనుమతించారంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో విచారణకు అధికారులు ఆదేశించారు.

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..


కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాంత్ షిండే గురువారం సాయంత్ర భార్య, మరో ఇద్దరితో కలిసి ఆలయ గర్భగుడిలో పూజలు చేసినట్టు ఆలయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడం, అందులోనూ ఏడాదిగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశంపై నిషేధం ఉండటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ విషయం చర్చనీయాంశమైంది. సామాన్య ప్రజానీకం మహాకాళేశ్వర్ దర్శనానికి గంటల తరబడి క్యూలలో నిలుచుంటారని, వీఐపీలను మాత్రం గర్భగుడి ప్రవేశంపై నిషేధం ఉన్నప్పటికీ ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేష్ పార్మార్ విమర్శించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తు్న్నామని అన్నారు.


జిల్లా కలెక్టర్ వివరణ

కాగా, ఆలయ గర్భగుడిలోకి ప్రవేశానికి అనుమతి లేదని, అనుమతి లేకుండా ప్రవేశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు ఆదేశాలిచ్చామని టెంపుల్ కమిటీ చైర్మన్, ఉజ్జయిని జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు. టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ గణేష్ థాకడ్ మాట్లాడుతూ, దీనిపై దర్యాప్తును ఆదేశించామని, ఆలయ గర్భగుడి, ఎంట్రీ పర్యవేక్షణ బాధ్యతులు నిర్వహించే ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 07:02 PM