ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: ఎడతెగని సస్పెన్స్.. షిండేను కలిసిన ఫడ్నవిస్

ABN, Publish Date - Dec 03 , 2024 | 08:12 PM

డిసెంబర్ 5న 'మహాయుతి' కూటమి సర్కార్ ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదానం ఓవైపు ముస్తాబవుతుండగా, ఉదయం నుంచి కూటమి ముఖ్య నేతలు ముగ్గురు వేర్వేరు సిటీల్లో ఉండటం చర్చనీయాంశమైంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో ఉండగా, థానేలో షిండే, ఢిల్లీలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఉన్నారు.

ముంబై: మహారాష్ట్రలో 'మహాయుతి' కూటమి కొత్త ప్రభుత్వ సారథి (Chief Minister) ఎవరనే సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అధికారిక నివాసమైన 'వర్ష' బంగ్లాలో మంగళవారం సాయంత్రం కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Eknath Shinde: ఆసుపత్రి నుంచి షిండే డిశ్చార్జి.. నేరుగా అధికార నివాసానికి


కాగా, మంగళవారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో చికిత్స పొందిన షిండే సాయంత్రమే డిశ్చార్జి అయ్యారు. అనంతరం నేరుగా ముంబై వర్ష రెసిడెన్స్‌కు చేరుకున్నారు. డిసెంబర్ 5న 'మహాయుతి' కూటమి సర్కార్ ప్రమాణస్వీకారానికి ముంబైలోని ఆజాద్ మైదానం ఓవైపు ముస్తాబవుతుండగా, ఉదయం నుంచి కూటమి ముఖ్య నేతలు ముగ్గురు వేర్వేరు సిటీల్లో ఉండటం చర్చనీయాంశమైంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో ఉండగా, థానేలో షిండే, ఢిల్లీలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఉన్నారు. ఈ నేపథ్యంలో షిండే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కావడం, తన అధికారిక నివాసానికి చేరుకోవడం, ఆయనను ఫడ్నవిస్ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాణస్వీకారానికి జరుగుతున్న సన్నాహాలను షిండేకు ఫడ్నవిస్ వివరించినట్టుగా తెలుస్తోంది.


బీజేపీ కీలక సమావేశం

మరోవైపు, బీజేపీ లెజిస్లేచర్ పార్టీ డిసెంబర్ 4న సమావేశం కానుంది. దీనికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆయనే కొత్త సీఎంగా పగ్గాలు చేపడతారు. రెండోసారి సీఎం పదవిని షిండే ఆశించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్దపార్టీగా నిలిచింందున బీజేపీకే ఈసారి సీఎం పదవి దక్కాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయంగా ఉంది. అధికారికంగా కొత్త సీఎం పేరు బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానంతరం బుధవారంనాడు ప్రకటించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

Supreme Court: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా...

Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 03 , 2024 | 08:12 PM