ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharshtra Elections: 'మహా' పోలింగ్‌కు హాలిడే.. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ క్లోజ్

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:51 PM

ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ డేను 'సెలవు దినం'గా ప్రకటించింది. కొన్ని సర్వీసులు యథాప్రకారం పనిచేయనుండగా, మరికొన్ని సేవలు మూతపడతాయి.

ముంబై: మహారాష్ట్రలోని 288 స్థానాల్లో నవంబర్ 20న పోలింగ్‌కు ఓటర్లు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలకు ఎలాంటి అవాతంరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు, సేవల నిర్వహణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ డేను 'సెలవు దినం'గా ప్రకటించింది. కొన్ని సర్వీసులు యథాప్రకారం పనిచేయనుండగా, మరికొన్ని సేవలు మూతపడతాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

Kasturi: కస్తూరికి కంటిమీద కునుకే లేదు.. జైలులో సాధారణ ఖైదీలతోనే


మూతపడే సేవలు

-బ్యాంకులు: మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు మూతపడతాయి. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే

నవంబర్ 20వ తేదీని హాలిడేగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

-స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE and BSE): నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సహా ముంబైలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మూతపడతాయి. ఫలితంగా శనివారంనాడు ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేస్తారు.

-విద్యా సంస్థలు: విద్యార్థులు, సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలను మూతపడతాయి.

-కార్యాలయాలు: నవంబర్ 20న రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసేస్తారు. అదనంగా బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలోని ప్రైవేటురంగం ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన హాలిడేను ప్రకటించింది. అత్యవసర పనులు, సేవల కోసం నాలుగు-గంటల విండో మాత్రం అందుబాటులో ఉంటుంది.

-మద్యం దుకాణాలు: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను నవంబర్ 20న మూసేస్తారు.


తెరిచి ఉంచే సర్వీసులివే..

-ఆసుపత్రులు: ఆసుపత్రులు తెరిచే ఉంటాయి. ఎమర్జెన్సీ సర్వీసులతో సహా మెడకల్ సేవలన్నీ యథాప్రకారం కొనసాగుతాయి

-ఫార్మసీలు: మందులు, అత్యవసర వైద్య సామగ్రి అందించే మెడికల్ షాపులను తెరిచే ఉంచుతారు.

-ప్రజా రవాణా: రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజారవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఓటర్ల పోలింగ్ స్టేషన్లకు చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలు, మెట్రో, బెస్ట్ బస్ సర్వీస్ వంటివి పూర్తి స్థాయిలో రోజంతా పనిచేస్తాయి. ప్రజారవాణా, పోలీసులు, అగ్నిమాపక శాఖ వంటి నిత్యావసర సేవలు యథాప్రకారం కొనసాగుతాయి.


ఇవి కూడా చదవండి...

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ల దాడి

అమెరికా పోలీసుల అదుపులో అన్మోల్‌ బిష్ణోయ్‌

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 19 , 2024 | 02:51 PM