ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Elections: 'మహా' ప్రచారం ముగిసింది.. ఓటరు తీర్పే ఫైనల్

ABN, Publish Date - Nov 18 , 2024 | 09:31 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్‌సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది

ముంబై: ఆరు ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా సాగించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడింది. తుదిరోజు ప్రచారంలో ఊహించినట్టుగానే బారామతిలో పవార్ వెర్సస్ పవార్ (Sharad Pawar Vs Ajit Pawar) హోరాహోరీగా తలబడటం ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తిని మరింత పెంచింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

Jharkhand Elections: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర


గతంలో ఎన్నడూ లేనంతగా..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్‌సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది. ఎన్నికల ప్రచారం చివరిరోజున ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే 4 ర్యాలీల్లో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి సహా 5 ర్యాలీల్లో, శరద్ పవార్ సైతం బారమతితో పాటు మరో 3 ర్యాలీలో పాల్గొన్నారు. మరో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజవర్గంలో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు.


ప్రచారంలో హేమాహేమీలు

ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అగ్రనేతలు క్షణం తీరకలేక్కుండా హోరాహోరీ ప్రచారం సాగించారనే చెప్పాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం మహారాష్ట్రలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం సాగించారు. అధికార మహాయుతి కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ప్రచారం సాగించగా, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సాధించిన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగించి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది.


కీలకాంశాలు ఏమిటి?

అధికార మహాయుతి కూటమి 'మాఝీ లడ్కీ బహిన్' వంటి పాపులర్ స్కీమ్స్‌‌పైన గట్టి ఆశలే పెట్టుకుంది. 'బాటేంగే తో కటేంగే', 'ఏక్ హై తో సేఫ్ హై' నినాదాలతో ముందుకెళ్లింది. నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఈ రెండు నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఈ నినాదాలను బీజేపీ భాగస్వామ్య పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయని కూడా చెప్పడానికి లేదు. అజిత్ పవార్ ఈ నినాదానికి దూరంగా ఉండగా, నినాదాలపై వివరణ ఇచ్చేందుకు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయత్నించారు. కాగా, విపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కులగణన, సామాజిక న్యాయం, రాజ్యంగ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా ప్రచారం సాగించింది. బీజేపీ తుదిప్రయత్నంగా 'సే నో టు కాంగ్రెస్' అంటూ ప్రజలకు పిలుపునిచ్చింది.


ఎవరెవరు..ఎన్ని చోట్ల పోటీ?

ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల్లో అధికార మహాయుత కూటమిలోని బీజేపీ, అజిత్ పవార్ ఎన్‌సీపీ, ఏక్‌నాథ్ షిండే కూటమి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) భాగస్వాములుగా ఉన్న ఎంవీఏ కూటమి ఉన్నాయి. మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ 149 సీట్లు, శివసేన 81 సీట్లు, అజిత్ పవార్ ఎన్‌సీపీ 59 నియోజకవర్గాల్లో పోటీ చేస్తు్న్నాయి. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ 101 సీట్లలో, శివసేన (యూబీటీ) 95 స్థానాల్లో, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 86 సీట్లలో పోటీ చేస్తు్న్నాయి. దీనికితోడు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) 237 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, ఏఐఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేస్తోంది.


ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 4,136 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి 28 శాతం అభ్యర్థులు పెరిగారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 150 స్థానాల్లో రెబల్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతంలో పోల్చుకుంటే రిజిస్ట్రర్డ్ ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈసారి 9 కోట్ల 63 లక్షల 69 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. లక్షకు పైగా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆరు లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.


ఇవి కూడా చదవండి...

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష

Swara Bhasker: స్వరభాస్కర్.. ఏంటిది? ముస్లిం మత పెద్దను కలిసిన బాలీవుడ్ నటిపై నెటిజన్ల ఆగ్రహం..

New Delhi: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. పెన్షన్ రూల్‌లో మార్పు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 18 , 2024 | 09:36 PM