ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: ఎంవీఏకు దెబ్బమీద దెబ్బ.. జారిపోయిన ఎస్‌పీ

ABN, Publish Date - Dec 07 , 2024 | 03:01 PM

మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఎంవీఏ 30 సీట్లు గెలుచుకోగా, నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 స్థానాలకు కేవలం 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి గణనీయంగా సీట్లు సాధించిన 'మహా వికాస్ అఘాడి' (MVA) అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా చతికిలపడింది. దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా తాజాగా ఎంవీఏ నుంచి సమాజ్‌వాదీ పార్టీ (SP) తప్పుకుంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం శివసేన (యూబీటీ) హిందుత్వ ఎజెండాను తలకెత్తుతందని, దీంతో తాము ఎంవీకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మి శనివారంనాడు తెలిపారు. మహారాష్ట్రలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఎంవీఏ 30 సీట్లు గెలుచుకోగా, నవంబర్ 20న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 స్థానాలకు కేవలం 49 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కూటమిలోని శివసేన (యూబీటీ) 20 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 16, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 10, సమాజ్‌వాదీ పార్టీ 2, సీపీఎం 1 సీటు గెలుచుకున్నాయి.

Earthquake: మూడు సార్లు భూకంపం.. బయటకు పరుగులు తీసిన జనం..


ఎంవీఏలో లుకలుకలు

మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని చవిచూడటంతో ఇప్పటికే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మితిమీరిన విశ్వాసం ప్రదర్శించిందని శివసేన యూబీటీ వ్యాఖ్యానించింది. గెలుపునకు ముందే కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖల కేటాయింపులపై మంతనాలు సాగించారని రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో విపక్ష నేత అంబదాస్ డాన్వె విమర్శించారు. పద మంది నేతలైతే ఏకంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ థాకరేను ప్రకటించి ఉంటే 2 నుంచి 5 శాతం ఓట్లు పార్టీకి అనుకూలంగా పడేవని పేర్కొన్నారు.


కాగా, మహారాష్ట్రలో తమ పార్టీకి కేవలం 2 సీట్లు తమకు కేటాయించడంపై ఎన్నికలకు ముందే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అబు అసిమ్ అజ్మి కాంగ్రెస్‌ను విమర్శించారు. హర్యానాలో ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. తాజాగా, ఎంవీఏ కూటమికి తాము ఉద్వాసన చెబుతున్నామని అధికారికంగా ఆయన ప్రకటించారు.


ఇవి కూాడ చదవండి...

Shooting: పట్టపగలు దారుణం.. మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యాపారిపై కాల్పులు, హత్య

Minister: మంత్రి కీలక వ్యాఖ్యలు.. అధికార పంపిణీ ఒప్పందం వాస్తవమే..

Read More National News and Latest Telugu News

Updated Date - Dec 07 , 2024 | 03:44 PM