ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: శివాజీ విగ్రహం కూలిన ఘటనలో పాటిల్ అరెస్ట్

ABN, Publish Date - Aug 30 , 2024 | 10:45 AM

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో నిర్మాణ సలహదారుడు చేతన్ పాటిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం కోల్హపూర్‌లో పాటిల్‌ను అతడి నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబయి, ఆగస్ట్ 30: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో నిర్మాణ సలహదారుడు చేతన్ పాటిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం కోల్హపూర్‌లో పాటిల్‌ను అతడి నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటన మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది.

Also Read: Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం


ఈ నేపథ్యంలో ఏకనాథ్ శిండే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా విగ్రహాన్ని నిర్మాణ సలహదారుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసింది. దీంతో చేతన్ పాటిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను శివాజీ విగ్రహానికి నిర్మాణ సలహాదారుడిగా వ్యవహరించలేదని ఈ సందర్బంగా అతడు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఈ విగ్రహానికి సంబంధించిన బేస్‌మెంట్ మాత్రం తాము నిర్మించామన్నారు. శివాజీ మహారాజు విగ్రహాన్ని మాత్రం థానేకు చెందిన మరో కంపెనీ నిర్మించిందని చేతన్ పాటిల్ పేర్కొన్నారు.

Also Read: Manipur: ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో రైఫిళ్లు చోరీ.. ఐదుగురు అరెస్ట్


2023, డిసెంబర్ 4వ తేదీన మహారాష్ట్ర మల్వానీలో రాజ్‌కోట్ కోటలో ప్రధాని నరేంద్ మోదీ ఆవిష్కరించారు. ఈ విగ్రహాం ఆవిష్కరించిన కేవలం 9 నెలల్లోనే కూలిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ అంశం రాజకీయ పార్టీలకు ఆయుధంగా మారాయి.

Also Read: Sri Lanka: దేశాధ్యక్షుడి ఎన్నికల వేళ.. కొలంబోకు అజిత్ దోవల్


దీంతో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాయి. దాంతో చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు ప్రాజెక్ట్ భారత నేవి పర్యవేక్షించిందని సీఎం ఏకనాథ్ శిండే స్పష్టం చేశారు. అలాగే ఈ విగ్రహం కూలిన ఘటనలో ఆయన క్షమాపణలు తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ చేయవద్దంటూ పార్టీలకు ఆయన ఈ సందర్బంగా విజ్జప్తి చేశారు.


ఈ విగ్రహనికి సంబంధించిన రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు సీఎం శిండే ప్రకటించారు. విగ్రహం కూలిన ఘటనపై చర్యలు చేపట్టేందుకు ఒక కమిటి పని చేస్తుందన్నారు. అలాగే అదే స్థానంలో సాధ్యమైనంత త్వరగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రెండు కమిటీలు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తాయని ఆయన ప్రకటించారు. ఈ విగ్రహం కూలిన ఘటనపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు ఈ విగ్రహం ఏర్పాటులో భారీ కుంభకోణం జరిగిందని సంజయ్ రౌత్ ఆరోపించారు.


ఈ విగ్రహం కూలిన ఘటనలో నిర్మాణ సలహాదారు చేతన్ పటేల్‌పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో కోల్హపూర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులతోపాటు మల్వానీ పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 10:45 AM

Advertising
Advertising