ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pragya Thakur: మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రగ్యా ఠాకూర్‌కు బెయిలబుల్ వారెంట్

ABN, Publish Date - Nov 05 , 2024 | 09:16 PM

ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నార్త్ మహారాష్ట్ర టౌన్ అయిన మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 20న బాంబు పేలుడు ఘటన జరిగింది. మసీదుకు సమీపంలోని మోటార్ వాహనానికి అమర్చిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

ముంబై: మాలేగావ్ పేలుళ్ల కేసు-2008 (Malegaon Blast Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ (Pragya Singh Thakur)కు ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కేసు విచారణకు హాజరుకానందుకు ఈ వారెట్లు జారీ అయ్యారు. కేసు తుది వాదనలు మొదలైనందున నిందితులు హాజరుకావడం తప్పనిసరి. ఠాకూర్‌పై రూ.10,000 బెయిలబుల్ వారెంట్‌ను ప్రత్యేక న్యాయమూర్తి ఏకే లహోతి జారీ చేశారు. నవంబర్ 13న తదుపరి విచారణకు హాజయ్యేంత వరకూ ఈ వారెంట్ అమలులో ఉంటుంది. కోర్టు ముందు ప్రగ్య ఠాకూర్ హాజరయితే వెంటనే వారెంట్ రద్దవుతుంది.

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి


ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రగ్యా ఠాకూర్ విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని ఆమె తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. అయితే కేసులో నెంబర్ వన్ నిందితురాలైన ప్రగ్యా జూన్ 4 నుంచి హాజరుకాలేదని, ఈరోజు కూడా ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టు మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీని సమర్పించారే కానీ ఒరిజినల్ సర్టిఫికెట్ సమర్పించలేదని ప్రత్యేక న్యాయమూర్తి పేర్కొంటూ ప్రగ్యా ఠాకూర్ అభ్యర్థనను తోసిపుచ్చారు.


మాలేగావ్ పేలుళ్ల కేసు..

ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలోని నార్త్ మహారాష్ట్ర టౌన్ అయిన మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 20న బాంబు పేలుడు ఘటన జరిగింది. మసీదుకు సమీపంలోని మోటార్ వాహనానికి అమర్చిన బాంబు పేలుడు ఘటనలో ఆరుగురు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు కుట్రపన్నారనే ఆరోపణపై ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మరో ఐదుగురు విచారణను ఎదుర్కొంటున్నారు. తొలుత ఈ ఘటనపై మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విచారణ జరపగా, ఆ తదనంతరం 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెస్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేశారు.


Also Read:

ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన

మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

For More National and telugu News

Updated Date - Nov 05 , 2024 | 09:21 PM