ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun kharge : బడ్జెట్‌లోనే హామీలివ్వండి

ABN, Publish Date - Nov 02 , 2024 | 04:21 AM

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ

  • ఐదు, ఆరు, పది అంటూ గ్యారెంటీలను ప్రకటించొద్దు

  • అమలులో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు

  • ప్రజల్లో విశ్వాసం కోల్పోతాం: కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే

  • ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల నేతలకు సూచన

  • ‘ఉచిత బస్సు’పై పునరాలోచన: డీకే శివకుమార్‌

  • తన ప్రకటనను వక్రీకరించారని తర్వాత వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 1: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హామీలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా హామీలు ప్రకటించవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. బడ్జెట్‌ పరిధిలోనే గ్యారెంటీలు ఇవ్వాలని తెలిపారు. శుక్రవారం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో అయిదు, ఆరు, పది, ఇరవై వంటి గ్యారెంటీలు ప్రకటించవద్దని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు సూచించాను. మీ రాష్ట్ర బడ్జెట్‌లో సరిపోయే హామీలే ఇవ్వండి. లేకుంటే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితులు వస్తాయి. ప్రణాళిక రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. రోడ్లు వేయడానికి కూడా నిధులు లేకపోతే అందరూ మీకు వ్యతిరేకంగా మారిపోతారు. వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా భావితరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని ఖర్గే హెచ్చరించారు. మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించే శక్తి పథకాన్ని పునఃసమీక్షిస్తామని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఖర్గే ఈ సూచనలు చేశారు.

కాగా, ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖర్గే తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో ఏకాభిప్రాయం లేకుండా ఒకేసారి ఎన్నికల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. ‘ప్రధాని ఏం చెప్పారో అది చేయరు. ఎందుకంటే ఈ బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి. ఉంటుంది. అప్పుడే అది సాధ్యం. కానీ అది జరిగే పని కాదు.


జమిలి ఎన్నికలు అసాధ్యం’ అని ఖర్గే పేర్కొన్నారు. కాగా, మోదీ మోసాలకు పాల్పడి ఎన్నికల్లో గెలుస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఈవీఎంల ప్రామాణికతను ఆయన ప్రశ్నించారు. ‘మోదీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అంతా మోసమే. ప్రతిసారీ పది వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడమో లేదా 10వేల నుంచి 20వేల మంది పేర్లు కొత్తగా చేర్చడమో చేస్తున్నారు. అయితే ఈ నిజాన్ని ఎలా నిరూపించాలనేదే ప్రశ్న’ అని ఖర్గే పేర్కొన్నారు.

  • కాంగ్రెస్‌ బూటకపుహామీలతో జాగ్రత్త: మోదీ

బడ్జెట్‌ పరిధిలోనే గ్యారెంటీలు ప్రకటించాలంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ‘బూటకపు వాగ్దానాలు చేయడం సులభమే. వాటిని అమలు చేయడం ఎంత కష్టమో, అసాధ్యమో కాంగ్రెస్‌ గుర్తిస్తోంది’ అంటూ ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా ప్రచారంలో హామీలతో ఊదరగొట్టారని, ఇప్పుడేమో ప్రజల ముందు వారి బండారం ఘోరంగా బట్టబయలైందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆర్థిక పరిస్థితి ఆధ్వానంగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ బూటకపు వాగ్దానాల సంస్కృతితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు.

  • మోదీ ట్వీట్లపై ఖర్గే కన్నెర్ర

ప్రధాని మోదీ విమర్శలపై ఖర్గే కన్నెర్ర చేశారు. బీజేపీ అంటేనే మోసపూరిత హామీలిచ్చే పార్టీ అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు అడ్డుకట్టే లేకుండా పోయిందని, మంచి రోజుల సంగతి ఏమైందని, వికసిత్‌ భారత్‌ ఎక్కడ అంటూ ఆయన మోదీకి వరుస ప్రశ్నలు సంధించారు. మోదీఇచ్చే గ్యారంటీ అనేది 140 కోట్ల మంది భారతీయులపై వేసిన క్రూరమైన జోక్‌ అని ఖర్గే మండిపడ్డారు. ఇతరులపై వేలుపెట్టి చూపేముందు మోదీ దీన్ని గుర్తించుకోవాలని సుచించారు.

Updated Date - Nov 02 , 2024 | 04:21 AM