LokSabha Elections: మమతా బెనర్జీకి మళ్లీ గాయాలు!
ABN, Publish Date - Apr 27 , 2024 | 03:43 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అసన్‌సోల్ వెళ్లేందుకు ఆమె హెలికాఫ్టర్ ఎక్కారు.
కొల్‌కత్తా, ఏప్రిల్ 27: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మళ్లీ గాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఆ క్రమంలో దుర్గాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం అసన్‌సోల్ వెళ్లేందుకు ఆమె హెలికాఫ్టర్ ఎక్కారు.
AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు
ఆ క్రమంలో సీట్లో కూర్చొంటూ హెలికాప్టర్‌లో కింద పడిపోయారు. ఆమె భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. ఈ ఘటనలో ఆమె గాయపడినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే గత నెల మార్చి 14న తన నివాసంలో పడిపోయారు.
దీంతో ఆమె తలకు, ముక్కుకు గాయాలయ్యాయి. దాంతో ఆ గాయాలకు వైద్యులు కుట్లు వేశారు. ఇక ఈ ఏడాది జనవరిలో మమత ప్రయాణిస్తున్న కాన్వాయిలోని వాహన శ్రేణిలోని కారు సెడన్ బ్రేక్ వేయడంతో.. ఆమె తల.. కారులోని ముందు భాగానికి తగిలింది. అయితే ఈ ప్రమాదంలో మమతకు ఎటువంటి గాయాలు కాలేదు.
AP Elections 2024: ఎన్నికల ముందే నీరుకారిపోయిన వంశీ
ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి, రెండో దశలో బెంగాల్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. మిగిలిన దశల్లో ఆయా నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు.. బెంగాల్‌లో ఈ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని భావిస్తుంది. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే బెంగాల్‌లో బీజేపీని నిలువరించేందుకు మమతా బెనర్జీ తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది.
Read National News And Telugu News
Updated Date - Apr 27 , 2024 | 03:47 PM