ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

West Bengal Bypolls: బెంగాల్ ఉప ఎన్నికల్లో మమత క్లీన్ స్వీప్... ఖాతా తెరవని బీజేపీ

ABN, Publish Date - Nov 23 , 2024 | 06:13 PM

సాంప్రదాయకంగా బీజేపీకి కంచుకోటుగా ఉన్న మదారిహత్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సైతం ఈసారీ టీఎంసీ తమ ఖాతాలో వేసుకుంది. 2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 29,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ గెలిచింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ (West Bengal Bypolls) మమతా బెనర్జీ (Mamata Banerjee) సారథ్యంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) తమకు తిరుగులేదని చాటుకుంది. ఎన్నికలు జరిగిన 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఉపఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ సాధించినట్టయింది. విపక్ష బీజేపీ ఖాతా తెరువకుండానే చతికిలపడింది. సాంప్రదాయకంగా బీజేపీకి కంచుకోటుగా ఉన్న మదారిహత్ (Madarihat) అసెంబ్లీ నియోజకవర్గాన్ని సైతం ఈసారీ టీఎంసీ తమ ఖాతాలో వేసుకుంది. 2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 29,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ గెలిచింది.

Maharashtra CM: మహారాష్ట్ర సీఎం పీఠం దక్కేదెవరికి?.. షిండే, ఫడ్నవిస్ మధ్యనే పోటీ


అలిపుర్దూర్ నుంచి బీజేపీ ఎంపీగా లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన మనోజ్ టిగ్గా.. మదారిహత్ అసెంబ్లీ సీటును వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా జరిపి ఆ నియోజకవర్గం ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి జయప్రకాష్ టొప్పో 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సితాయి నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి సంగీత రాయ్ 1.3 లక్షల ఆధిక్యంతోనూ, నైహతి నుంచి టీఎంసీ అభ్యర్థి సనత్ డే 50,000 ఓట్ల అధిక్యంతోన, హరొయా నుంచి టీఎంసీ అభ్యర్థి షేక్ రబియుల్ ఇస్లామ్ 1.3 లక్షల ఆధిక్యంతోనూ గెలిచారు. మేదినిపూర్ నుంచి టీఎఁసీ నేత సుజయ్ హచ్రా 34,000, తల్దంగ్రా నుంచి టీఎంసీ నేత ఫల్గుణి సింఘబాబు 34,000 ఓట్ల ఆధిక్యంతోనూ గెలుపొందారు.


కాగా, టీఎంసీ 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ క్లీన్ స్పీన్ చేయడంతో టీఎంసీ కార్యకర్తలు సౌత్ కోల్‌కతాలోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వెలుపల సంబరాలు జరుపుకొన్నారు. టీఎంసీకి నిరంతరం మద్దతుగా నిలుస్తూ విజయాలను అందిస్తు్న్న ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సామాజిక మాధ్యం 'ఎక్స్'లో కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'

Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 23 , 2024 | 06:15 PM