ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodar Valley Corporation: ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ మళ్లీ లేఖ

ABN, Publish Date - Sep 22 , 2024 | 08:51 PM

డ్యామ్‌ల నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) నీరు విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు వరద పోటెత్తింది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

కోల్‌కతా, సెప్టెంబర్ 22: డ్యామ్‌ల నుంచి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) నీరు విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు వరద పోటెత్తింది. దీంతో ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సీఎం మమతా బెనర్జీ మరో లేఖ రాశారు.

Also Read: Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు


తమ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఈ నీటిని విడుదల చేసిందని ఆ లేఖలో ఆమె ఆరోపించారు. అందువల్లే పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తిందని పేర్కొన్నారు. ఈ వరదల వల్ల 50 లక్షల మంది బాధితులుగా మారారన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆమె నిప్పులు చెరిగారు.

Also Read: Flight Makes Emergency Landing: విమానంలో ఎలుక... అత్యవసరంగా ల్యాండింగ్..


అయితే రిజర్వాయర్ల నుంచి ప్రతి సారి నీటి విడుదల విడుదల చేసే క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి డీవీసీ సమాచారం అందించిందంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆమె ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఓ రాష్ట్రానికి సంబంధించి.. నీటి విడుదలలో కేంద్ర జల సంఘం, జల వనరుల మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఏక తాటిపైకి రాకుండానే పలు క్లిష్టమైన నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపించారు.

Also Read: Viral Video: భారత్‌లో సరే.. చైనాలో జనరల్ రైలు బోగీలో ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా?


ప్రభుత్వానికి కనీసం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే నీటిని విడుదల చేస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని సైతం గౌరవించడం లేదన్నారు. శుక్రవారం తాను లేఖలో పేర్కొన్న అంశాలను తాను రాసిన రెండో లేఖలో సైతం పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు. ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పర్కిష్కరించేందుకు మీ జోక్యాన్ని కోరుతున్నానని ఆ లేఖలో సీఎం మమత స్పష్టం చేశారు.

Also Read: Rail Track: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు.. తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Also Read: YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు


మానవ తప్పిదం కారణంగా వరద నీరు వల్ల దక్షిణ బెంగాల్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని.. దీంతో అత్యవసర నిధులు విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి శుక్రవారం సీఎం మమత లేఖ రాసిన సంగతి తెలిసిందే.

For More AndhraPradesh News And Telugu News..

Updated Date - Sep 22 , 2024 | 08:51 PM