ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RG Kar Medical Hospital: వైద్యురాలి హత్యాచారం వేళ.. సీఎం మమత లేఖ వైరల్

ABN, Publish Date - Aug 23 , 2024 | 06:39 PM

జన్మదినం సందర్భంగా ప్రొ. సందీప్ ఘోషకు సీఎం మమతా బెనర్జీ బర్త్ డే విషెష్ చెబుతున్న ఓ లేఖ ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదీకూడా 2022, జూన్ 30వ తేదీ ప్రొ. సందీప్ జన్మదినం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఈ లేఖ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పినట్లుగా ఆ లేఖలో స్పష్టంగా ఉంది.

కోల్‌కతా, ఆగస్ట్ 23: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసు.. ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌‌ చుట్టునే తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రొ. సందీప్‌తోపాటు మరో నలుగురు వైద్యులకు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వారికి సాధ్యమైనంత త్వరలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తుంది.

Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు


ప్రొ. డాక్టర్ సందీప్ ఘోష్‌కు బర్త్‌ డే విషెస్..

అలాంటి వేళ ప్రొ. సందీప్ ఘోష్ జన్మదినం సందర్భంగా ఆయనకు సీఎం మమతా బెనర్జీ బర్త్ డే విషెష్ చెబుతున్న ఓ లేఖ అయితే ప్రస్తుతం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదీకూడా 2022, జూన్ 30వ తేదీ ప్రొ. సందీప్ జన్మదినం సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఈ లేఖ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పినట్లుగా ఆ లేఖలో స్పష్టంగా ఉంది. దీంతో సీఎం మమతా బెనర్జీతో ప్రొ. సందీప్ ఘోష్ సన్నిహిత సంబంధాలున్నాయనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.

Also Read: kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన


హత్యాచారం అనంతరం...

అదీకాక.. ఈ హత్యాచారం జరిగిన అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాలు.. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్ వ్యవహరించిన తీరు తీవ్ర సందేహాస్పదంగా ఉందనే అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది. అలాగే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కాలేజీ ప్రిన్నిపల్‌కి సంబంధాలున్నాయనే చర్చ కూడా నడుస్తుంది.

Also Read: Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం


ఘెష్ రాజీనామా.. ఆ తర్వాత కీలక పదవి..

ఈ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. అనంతరం ఆయనను కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. ఈ హత్యాచార విచారణ సమయంలో ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు ప్రస్తావించింది. ఆయన సెలవుపై పంపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ


అనాథ శవాలు, బయో వ్యర్థాలు సైతం విక్రయమంటూ ఆరోపణలు..

ఇదే సమయంలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సిట్‌ను హైకోర్టు ఏర్పాటు చేసింది. అలాగే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ ప్రొ. సందీప్ ఘోష్ హయాంలో చోటు చేసుకున్న నేరాల చిట్టాను ఆ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం విదితమే. ఈ కాలేజీ ఆసుపత్రిలో అనాథ శవాలను సైతం ఆయన విక్రయించి సొమ్ము చేసుకునే వారని.. అలాగే ఆసుపత్రిలోని వ్యర్థాలను పొరుగునున్న బంగ్లాదేశ్‌కు అమ్ముకునే వారంటూ తన ఇంటర్వ్యూలో అక్తర్ అలీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 06:44 PM

Advertising
Advertising
<