Bihar: కేంద్ర మంత్రిపై దాడికి యువకుడి యత్నం
ABN, Publish Date - Aug 31 , 2024 | 09:21 PM
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ పై దాడికి యత్నం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక యువకుడు మంత్రిపై దాడికి ప్రయత్నించడంతో సింగ్ మద్దతుదారులు అతన్ని వెంటనే అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
పాట్నా: కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ (Giriraj Singh)పై దాడికి యత్నం జరిగింది. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక యువకుడు మంత్రిపై దాడికి ప్రయత్నించడంతో సింగ్ మద్దతుదారులు అతన్ని వెంటనే అదుపులోనికి తీసుకుని పోలీసులకు అప్పగించారు. శనివారంనాడు 'జనతా దర్బార్' ప్రోగ్రామ్ కోసం మంత్రి తన నియోజవర్గమైన బెగుసరాయ్ వచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?
''మౌల్వి తరహాలో దుస్తులు ధరించి గడ్డంతో ఉన్న యువకుడు ఒక పిటిషన్ తీసుకుని నా వద్దకు వచ్చాడు. పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా కోరాడు. జనతా దర్బార్ ముగిసిందని, సకాలంలో వచ్చి ఉండాల్సిందని అతనికి చెప్పాను. దాంతో అతను గట్టిగా కేకలేస్తూ నాకు వ్యతిరేకంగా నినాదులు చేశాడు. ఒక దశలో అతను భౌతిక దాడికి పాల్పడతాడని అనిపించింది. యువకుడు మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. ఇలాంటి దాడులకు భయపడేది లేదు'' అని గిరిరాజ్ సింగ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో తెలిపారు. కాగా, ఈ ఘటనలో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు బెగుసరాయ్ ఎస్పీ మనీష్ తెలిపారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 31 , 2024 | 09:21 PM