Amritsar Golden Temple Incident: గోల్డెన్ టెంపుల్ దగ్గర సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు..
ABN, Publish Date - Dec 04 , 2024 | 10:09 AM
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఆ క్రమంలో అక్కడున్న వ్యక్తులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉండటం విశేషం.
పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై (Sukhbir Badal) కాల్పుల దాడి జరిగింది. అయితే ఈ దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. స్వర్ణ దేవాలయం (Amritsar Golden Temple) ప్రవేశ ద్వారం వద్ద శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. అయితే అక్కడున్న వ్యక్తులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి పేరు నారాయణ్ సింగ్ చౌదా. అతను దాల్ ఖల్సా పనివాడు అని చెబుతున్నారు.
దాడికి కారణమిదేనా..
సుఖ్‌బీర్‌పై దాడి చేసేందుకు నిందితుడు తన ప్యాంట్‌లోని పిస్టల్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఒక వ్యక్తి గమనించి అతనిపై దాడి చేసి పట్టుకున్నాడు. నిందితుడు ఖలిస్తాన్ మద్దతుదారుగా అనుమానిస్తున్నారు. ఆత్మత్యాగం కేసుల విషయంలో ఆ వ్యక్తి సుఖ్‌బీర్ బాదల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే సిక్కు మత పెద్దలు 'టంకా' (మతపరమైన శిక్ష) ప్రకటించిన ఒక రోజు తర్వాత, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ బాదల్ నిన్న గోల్డెన్ టెంపుల్ వెలుపల 'సేవదార్'గా చేశారు. ఆయన ఈరోజు రెండో రోజు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న బాదల్ తన శిక్ష అనుభవిస్తున్నప్పుడు వీల్ చైర్‌లో స్వర్ణ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద నిలబడి, ఒక చేతిలో ఈటె పట్టుకుని, నీలిరంగు 'సేవదార్' యూనిఫాం ధరించారు. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో వీల్ చైర్ ఉపయోగిస్తున్నారు.
టెంపుల్ కాంప్లెక్స్‌లో కలకలం
నిందితుడిని ఆపగలిగే సమయానికి, కాల్పులు జరిగాయి. కానీ అదృష్టవశాత్తూ అది మిస్ ఫైర్ అయ్యింది. ఎవరికీ గాయాలు కాలేదు. ఈ క్రమంలో ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు నిందితుడిని అదుపు చేసి పోలీసులకు అప్పగించారు. దర్బార్ సాహిబ్ ముందు దాడి చేసిన వ్యక్తి కాల్పులు జరపడంతో గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో కలకలం రేగింది. ప్రస్తుతం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు నిందితుడికి ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సాతో సంబంధం ఉందని అంటున్నారు. చండీగఢ్ జైల్ బ్రేక్ ఘటనలో కూడా నిందితుడిగా ఉన్నారని చెబుతున్నారు. జైలు జీవితంలో 2 సంవత్సరాల శిక్షను అనుభవించాడని, ఆయుధాల స్మగ్లింగ్‌లో కూడా నిందితుడి పేరు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పేరు నారాయణ్ సింగ్ అని, అతను ఛాందసవాద భావజాలానికి చెందినవాడని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Real vs Fake Charger: మీ ఫోన్ ఛార్జర్ నిజమైనదా, నకిలీదా.. ఇలా గుర్తించండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Dec 04 , 2024 | 10:58 AM