ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kangana Ranaut: నువ్వు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చుంటావు.. రాహుల్‌పై ఎంపీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 12 , 2024 | 12:19 PM

సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ ఆమె భర్త ధవల్ బుచ్‌లపై ఇటివల హిండెన్‌బర్గ్(hindenburg) నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై రిపోర్టుకు మద్దతుగా ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్(kangana ranaut) రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

kangana ranaut comment on rahul gandhi

సెబీ ఛైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ (madhabi puri buch) ఆమె భర్త ధవల్ బుచ్‌లపై ఇటీవల హిండెన్‌బర్గ్ (hindenburg) నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విచారణ జరిపించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (kangana ranaut) రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కంగనా అన్నారు. దేశం మిమ్మల్ని ఎన్నటికీ నాయకుడిగా ఎన్నుకోదని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసక వ్యక్తి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని కంగనా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ధి, జాతీయత మిమ్మల్ని ఎప్పటికీ అవమానకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోరని ఘటు వ్యాఖ్యలు చేశారు.


విపక్షాల డిమాండ్‌

ఆగస్టు 10న US ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఛైర్‌పర్సన్ మధాబి బుచ్(Madhabi Puri Buch), ఆమె భర్త అదానీ మనీ సైఫనింగ్ స్కామ్‌లో ఉపయోగించిన షాడో ఆఫ్‌షోర్ ఫండ్‌లలో వాటాలు కలిగి ఉన్నారని ఆరోపించింది. ఆ క్రమంలో అదానీ షేర్లకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదిక దేశంలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు సెబీ చీఫ్‌ రాజీనామా, జేపీసీ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stampede: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 9 మందికి గాయాలు


ప్రభుత్వంపై

సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల తర్వాత నిన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సెబీ ఛైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలు సంస్థ సమగ్రతను తీవ్రంగా దెబ్బతీశాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్వయంచాలకంగా పరిగణిస్తుందా అని ఆయన ఆదివారం ప్రశ్నించారు. సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదనే అనేక ప్రశ్నలు దేశవ్యాప్తంగా ఉన్న నిజాయితీగల పెట్టుబడిదారులకు ప్రభుత్వంపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు కష్టపడి సంపాదించిన డబ్బు పోతే దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి:

Alert: దంచికొడుతున్న వర్షాలు గత 24 గంటల్లో 28 మంది మృతి.. IMD హెచ్చరిక

Delhi : ఆరోపణలు పచ్చి అబద్ధాలు

District Magistrate : లోపాలకు అధికారులే బాధ్యులు..


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 12:49 PM

Advertising
Advertising
<