Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌తో మనీశ్ సిసోడియా భేటీ..!
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:42 PM
మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వారసులు ఎవరు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయి.. బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన ఆదివారం న్యూఢిల్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ వారసులు ఎవరు అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భేటీ కానున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేజ్రీవాల్‌తో మనీశ్ సిసోడియా సమావేశం కానున్నారు. దీంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
Also Read: Donald Trump's: ట్రంప్‌పై కాల్పులు జరిపిన ర్యాన్ రౌత్: అతడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
Also Read:Tripura: గంటల వ్యవధిలో మరో దారుణం
ఎందుకంటే.. మనీశ్ సిసోడియా సైతం సీఎం పదవి చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే ఓ ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆయన సైతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పీఠంపై కూర్చోబెడతారా? అంటే సందేహమేననే ఓ చర్చ సైతం సాగుతుంది. మరోవైపు కేజ్రీవాల్ భార్య సునీతతోపాటు మరో ఐదుగురు పేర్లు.. అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం పేరు మంగళవారం దాదాపుగా ఖరారవుతుందని తెలుస్తుంది.
Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ
Also Read:Pedana: పెడనలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
వచ్చే ఏడాది అంటే.. 2025, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఈ ఎన్నికలు.. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. అదీకాక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. అదే జరిగితే.. ఈ ఏడాది చివరి లోపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనే విషయం సుస్పష్టం కానుంది.
Also Read: Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి
Also Read: Dr Chandrasekhar Pemmasani: ‘సమాజం కోసమే రాజకీయాల్లోకి వచ్చా’
For More National News and Telugu News
Updated Date - Sep 16 , 2024 | 12:44 PM