Manmohan Maruti 800: మన్మోహన్ సింప్లిసిటీ.. 'మారుతి 800'తో అనుబంధం
ABN, Publish Date - Dec 27 , 2024 | 03:33 PM
మన్మోహన్‌కు ఆయన సొంత కారు 'మారుతి 800'తో ఎంతో అనుబంధం ఉండేదని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చీఫ్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అసీమ్ అరుణ్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఆర్థికవేత్త నుంచి రాజకీయవేత్తగా ఎదిగి, రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడే వారు. దేశానికి తాను ప్రధానమంత్రే అయినా తనను తాను ఒక సాధారణ వ్యక్తిగానే ఆయన భావించే వారు. ఆడంబరాలు లేని సాధారణ జీవితం గడపడంపైనే ఆసక్తి చూపేవారు. మన్మోహన్‌కు ఆయన సొంత కారు 'మారుతి 800' (Maruti 800) తో ఎంతో అనుబంధం ఉండేదని ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (SPG) చీఫ్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అసీమ్ అరుణ్ (Aseem Arun) తెలిపారు. అసీమ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కౌనౌజ్ సదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి
మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన జ్ఞాపకాలను అసీమ్ అరుణ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పంచుకున్నారు. మన్మోహన్‌కు సొంతంగా 'మారుతి 800' ఉండేదని, అందటే ఆయన ఎంతో ఇష్టపడేవారని చెప్పారు. ''2004 నుంచి సుమారు మూడేళ్ల పాటు ఆయనకు (మన్మోహన్) బాడీగార్డ్‌గా ఉన్నాను. ఆయనకు అత్యంత దగ్గరగా ఎస్‌పీజీ భద్రత ఉండేది. క్లోజ్ ప్రొటక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు వచ్చింది. అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నేను ఎన్నడూ ఆయనకు దూరంగా ఉండేవాడిని కాదు. ఒకే బాడీగార్డును అనుమతించాల్సి వచ్చినప్పుడు నేను ఉండేవాడిని. దాంతో మన్మోహన్‌కు నీడలా ఉండే బాధ్యత నాకుండేది" అని అసీమ్ అరుణ్ చెప్పారు.
నిరాండబరంగా ఉండటానికే మన్మోహన్ సింగ్ ఇష్టపడేవారని చెబుతూ, డాక్టర్ సింగ్‌కు సొంతంగా ఒకే ఒక 'మారుతి 800' కారు ఉండేదని, దానిని పీఎం నివాసంలోని బ్లాక్ బీఎండబ్ల్యూ వెనుకాల పార్క్ చేసేవారని తెలిపారు. బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం కంటే తన సొంత కారులోనే ప్రయాణిస్తానని ఆయన తనతో అనేవారని, అయితే లగ్జరీ కోసం కాకుండా సెక్యూరిటీ ఫీచర్స్ కోసం బీఎండబ్ల్యూలో ప్రయాణం తప్పదని తాను చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ మాత్రం తాను మధ్యతరగతి వాడినని, ఖరీదైన కార్లు ప్రధానమంత్రికి చెందినవని, తన కారు మాత్రం ఈ మారుతీ కారేనని చెప్పేవారని తెలిపారు.
దేశంలో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు.1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు పునాది వేశారు.
ఇవి కూడా చదవండి...
Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో
Bangalore: ఎమ్మెల్యేపై దాడితో.. ఎమ్మెల్సీ సీటీ రవికి భద్రత పెంపు
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 27 , 2024 | 03:34 PM