Mansoor Ali Khan: విలన్ నోట కామెడీ మాట.. కారులో పౌడర్ ఉంది పూసుకుంటారా?
ABN, Publish Date - Mar 30 , 2024 | 11:10 AM
వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు మన్సూర్ అలీఖాన్(Movie actor Mansoor Ali Khan) కారు తనిఖీ చేయడానికి వెళ్ళిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది.
చెన్నై: వేలూరు లోక్‌సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటుడు మన్సూర్ అలీఖాన్(Movie actor Mansoor Ali Khan) కారు తనిఖీ చేయడానికి వెళ్ళిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. గుడియాత్తం సమీపం మేల్‌పట్టివద్ద కారులో వెళుతున్న ఆయనను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత తమ గుర్తింపు కార్డులను చూపి కారులో తనిఖీ జరిపారు. చివరకు కారు నెంబర్‌ను, అందులో ప్రయాణిస్తున్న వివరాలను అధికారులు తమ పుస్తకంలో రాసుకున్నారు. ఆ సమయంలో మన్సూర్ అలీఖాన్ వారితో మాట్లాడుతూ కారులో చిల్లర నాణేలు కూడా లేవని, అయితే ముఖానికి పూసుకునే పౌడర్ మాత్రం డబ్బాల కొద్దీ పడి ఉన్నాయని, ఆ ఫౌడర్‌ను పూసుకుంటారా? అని ప్రశ్నించారు. మన్సూర్ అలీఖాన్ ఉన్నట్టుండి పౌడర్ పూసుకుంటారా అని అడిగిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులలో ఉన్న ఓ మహిళ ఫక్కున నవ్వేశారు. వెంటనే తక్కిన అధికారులు కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళి పోయారు.
Updated Date - Mar 30 , 2024 | 11:10 AM