ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలు

ABN, Publish Date - Jun 07 , 2024 | 03:53 AM

ఎన్డీయే కూటమి అధ్యక్షునిగా భాగస్వామ్య పార్టీలు నరేంద్ర మోదీని ఎన్నుకోవడంతో ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది.

  • హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు, బంగ్లా ప్రధాని

  • భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌ అధినేతలకు ఆహ్వానాలు !

న్యూఢిల్లీ, జూన్‌ 6: ఎన్డీయే కూటమి అధ్యక్షునిగా భాగస్వామ్య పార్టీలు నరేంద్ర మోదీని ఎన్నుకోవడంతో ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ప్రధాని మోదీకి వేర్వేరుగా ఫోన్లు చేసిన శ్రీలంక అధ్యక్షుడు, బంగ్లా ప్రధాని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని ఈ సందర్భంగా మోదీ వారిని ఆహ్వానించగా ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. నేపాల్‌, భూటాన్‌, మారిషస్‌ దేశాల అధినేతలకు కూడా మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయని సమాచారం. మోదీ ప్రమాణస్వీకారం జూన్‌ 8 లేదా 9వ తేదీల్లో జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. మోదీకి తైవాన్‌ అధ్యక్షురాలు శుభాకాంక్షలు చెప్పారు. వివిధ రంగాల్లో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. దీనిపై చైనా అభ్యంతరం తెలిపింది. తైవాన్‌ అనేది ప్రత్యేక దేశం కాదని, దానికి ప్రెసిడెంట్‌ అంటూ ఎవరూ లేరని పేర్కొంది.

Updated Date - Jun 07 , 2024 | 07:19 AM

Advertising
Advertising