Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఏడుగురు మృతి
ABN, Publish Date - May 23 , 2024 | 04:37 PM
మహారాష్ట్రలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థానే జిల్లా డోంబివిలిలో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడ్డాయి. ఫ్యాక్టరీలో గల నాలుగు బాయిలర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న రసాయనాలకు అంటుకున్నాయి. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కొందరిని రక్షించారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
మహారాష్ట్రలో (Maharashtra) ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థానే జిల్లా డోంబివిలిలో గల ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడ్డాయి. ఫ్యాక్టరీలో గల నాలుగు బాయిలర్లు పేలడంతో ప్రమాదం జరిగింది. మంటలు అంటుకోవడంతో ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న రసాయనాలకు అంటుకున్నాయి. దాంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కొందరిని రక్షించారు. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. 48 మందికి గాయాలు అయ్యాయి. 10 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు నాలుగు గంటల సమయం పట్టొచ్చని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.
Updated Date - May 23 , 2024 | 07:27 PM