Mayawati: అల్లుణ్ని తొలగించిన మాయావతి
ABN, Publish Date - May 08 , 2024 | 10:31 AM
తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తున్నట్లు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
లఖ్‌నవూ: తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి తొలగిస్తున్నట్లు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న ఆమె... పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని, ఆకాశ్‌కు పరిపక్వత వచ్చేంత వరకు వేటు తప్పదని పేర్కొన్నారు.
అయితే తన తమ్ముడు ఆనంద్ కుమార్ మాత్రం యథావిధిగా కొనసాగనున్నట్లు తెలిపారు. సరిగ్గా మూడో దశ పోలింగ్ ముగిసిన రోజునే మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకొంది.
కాగా, గతంలో... అల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ఆమె తన రాజకీయ వారసుడిగా ప్రకటించడం గమనార్హం.
Updated Date - May 08 , 2024 | 10:31 AM