ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్య ఖర్చులు పైపైకి..!

ABN, Publish Date - Sep 30 , 2024 | 04:54 AM

పెరుగుతున్న ధరలు, ఇతర వ్యయాలతో నెలనెలా కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది. వీటికితోడు ఇటీవల వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

  • భారత్‌లో ప్రతి ఏటా 14% పెరుగుదల

  • గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు అధికం

  • అకో ఇండియా హెల్త్‌ ఇండెక్స్‌లో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: పెరుగుతున్న ధరలు, ఇతర వ్యయాలతో నెలనెలా కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది. వీటికితోడు ఇటీవల వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో ప్రజల ఆస్పత్రి ఖర్చులు ఏడాదికి 14% పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అకో (ఏసీకేవో) అనే బీమా సంస్థ రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ విడుదల చేసిన ‘అకో ఇండియా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇండెక్స్‌-2024’... భారత్‌లో ఆరోగ్య ద్రవ్యోల్బణం 14 శాతంగా ఉందని, ఆరోగ్య సంరక్షణ వ్యయం ప్రతి ఏడాది 14% పెరుగుతోందని పేర్కొంది. 23% మంది ఈ ఆస్పత్రి చార్జీలను రుణాల ద్వారా సమకూర్చుకుంటున్నారని, ఇది ఆయా కుటుంబాలను విపరీతమైన ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నాయని నివేదిక పేర్కొంది. దేశంలో ఇంకా 68% మంది ఆరోగ్య ఖర్చులను తమ జేబు నుంచే చెల్లిస్తున్నారని తెలిపింది.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఆరోగ్య పాలసీ క్లెయిములను విశ్లేషించిన అకో.. మూత్ర పిండాల వ్యాధుల్లో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్టు గుర్తించింది. కిడ్నీ చికిత్స క్లెయిములు ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని, ఆ తర్వాతి స్థానం కొచ్చిదని తెలిపింది. కొచ్చితోపాటు హైదరాబా ద్‌, బెంగళూరు, జైపూర్‌లో దాఖలవుతున్న క్లెయిముల జాతీయ సగటు కంటే అధికంగా ఉందని తెలిపింది. కిడ్నీ చికిత్సలకు క్లెయిమ్‌ చేసే రోగుల సగటు వయ స్సు 47 ఏళ్లుగా ఉందని పేర్కొంది. మూత్రపిండాల ఆరోగ్యంతోపాటు గుండెజబ్బులు, ఇతర క్లిష్టమైన ఆరో గ్య సమస్యలను కూడా ఈ నివేదిక ఎత్తి చూపింది. గుండె జబ్బుల చికిత్స క్లెయిములు ఎక్కువగా నమోదైన నగరాల్లో కోల్‌కతా, ముంబై ముందువరుసలో ఉన్నాయని తెలిపింది. 2020 నుంచి 2024 మధ్యకాలంలో క్యాన్సర్‌ కేసులు 13% పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది.

Updated Date - Sep 30 , 2024 | 04:54 AM